BigTV English

Ragi biscuits: ఇంట్లోనే హెల్తీగా రాగి బిస్కెట్లు చేసేయండి, పిల్లలు పెద్దలు ఇద్దరూ ఇష్టంగా లాగించేస్తారు

Ragi biscuits: ఇంట్లోనే హెల్తీగా రాగి బిస్కెట్లు చేసేయండి, పిల్లలు పెద్దలు ఇద్దరూ ఇష్టంగా లాగించేస్తారు

రాగులతో చేసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ రోగులకు కూడా రాగి పిండి చేసే మేలు అంతా ఇంతా కాదు. పిల్లలు, పెద్దలు.. ఇద్దరూ కూడా ఆహారంలో రాగులను భాగం చేసుకుంటే మంచిది. బయట బిస్కెట్లు, కుకీలు కొనే బదులు ఇంట్లోనే సింపుల్ గా రాగి బిస్కెట్లు లేదా రాగి కుకీలను తయారు చేసేందుకు ట్రై చేయండి. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. సింపుల్ పద్ధతుల్లో వాటిని ఎలా చేయాలో తెలుసుకోండి.


రాగి బిస్కెట్లు రెసిపీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి – అరకిలో
కార్న్ ఫ్లోర్ – 70 గ్రాములు
ఓట్స్ – అరకిలో
నీరు – సరిపడినంత
మైదా పిండి – 170 గ్రాములు
చక్కెర – ముప్పావు కిలో
తేనె – 50 గ్రాములు
బేకింగ్ సోడా – రెండు స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్ – ఒక స్పూను
గ్లూకోజ్ పొడి – ఒక స్పూను
అన్ సాల్టెడ్ బటర్ – 450 గ్రాములు
కొబ్బరి తురుము – 300 గ్రాములు
పాలపొడి – రెండు స్పూన్లు
బేకింగ్ పౌడర్ – రెండు స్పూన్లు

రాగి బిస్కెట్లు రెసిపీ
1. ఒక గిన్నె తీసుకొని అందులో బటర్, చక్కెర, వెనిల్లా ఎసెన్స్, రాగి పిండి, తేనె వేసి బాగా కలపండి.
2. కొద్ది కొద్దిగా నీరు పోసి అది చిక్కగా అయ్యే వరకు బాగా కలపండి.
3. ఆ తర్వాత అందులో మొక్కజొన్న పిండి, ఓట్స్, బేకింగ్ పౌడర్, పాల పొడి, కొబ్బరి తురుము, గ్లూకోజు, బేకింగ్ సోడా వేసి గిలకొట్టండి.
4. అది చిక్కటి పేస్టులా అవ్వాలంటే ఎంత నీరు అవసరమో అంత నీరు వేసి బాగా కలపండి.
5. మరి మెత్తగా కాకుండా పూరి పిండి లాగా అయ్యేలా కలుపుకోవాలి. చేతితో దాన్ని బాగా నొక్కండి.
6. ఇప్పుడు దాన్ని ఒక బంతిలాగా చేసి పైన ఒక క్లాత్ ను కప్పి సాధారణ ఫ్రిజ్లో పెట్టండి.
7. ఒక గంట పాటు అలా ఉంచండి. ఈలోపు ఓవెన్లో 170 డిగ్రీ సెల్సియస్ దగ్గర ముందుగానే ప్రీ హీట్ చేయండి.
8. అందులో బేకింగ్ ట్రే పెట్టి అందులో బేకింగ్ షీట్ ను పరచండి.
9. ఫ్రిజ్లో పెట్టిన రాగి ముద్దను తీసి బిస్కెట్లులాగా చేతితోనే ఒత్తి ఆ బేకింగ్ షీట్ పై పెట్టండి.
10. తర్వాత ఓవెన్ ను 180 డిగ్రీల సెల్సియల్సిస్ వద్దే పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.
11. అవి క్రిస్పీగా అయ్యేవరకు ఉంచి తర్వాత ఓవెన్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ రాగి బిస్కెట్లు లేదా రాగి కుకీలు రెడీ అయిపోతాయి.


ఈ రాగి బిస్కెట్లు, రాగి కుకీస్ ను ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని గాలి చొరబడని కంటైనర్లలో వేసి ఉంచుకోవాలి. మీకు పంచదార వాడడం ఇష్టం లేకపోతే దాని స్థానంలో బ్రౌన్ షుగర్ లేదా బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా శరీరానికి బలాన్ని అందిస్తుంది. ఇందులో మనం వేసినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కేవలం మీరు పంచదార స్థానంలో బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. కచ్చితంగా వీటి రుచి మీకు నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

Related News

Flax seeds: అవిసె గింజల నూనెతో ఇలా కూడా చేస్తారా! ఉపయోగం ఏమిటి?

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా..? వచ్చే మార్పులు ఇవే!

Mobile Phones: పిల్లల ఆరోగ్యంపై.. మొబైల్ ఫోన్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే ?

Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Big Stories

×