E-Paper
Advertisement

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Rudramadevi:ఎప్పుడైనా సరే దర్శక రచయితలు ఒక కథను రాసుకునేటప్పుడు ఆయా పాత్రలలో ఫలానా హీరో లేదా హీరోయిన్ సెట్ అవుతుందని ఊహించి మరీ పాత్రలు రాస్తారు. అయితే ఆ పాత్రలను ఆయా నటీనటులకు వినిపించినప్పుడు అందులో కొంతమంది యాక్సెప్ట్ చేస్తే మరికొంతమంది రిజెక్ట్ చేస్తారు . ఇంకొంతమంది చేయాలని ఆశలు పెట్టుకున్నా.. తప్పని పరిస్థితుల్లో ఆ పాత్రలు చేజారిపోతూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పాత్ర పై బడా హీరోలు ఆశలు పెట్టుకున్నా.. తప్పని పరిస్థితుల్లో ఆ పాత్ర వేరొకరికి వెళ్లాల్సి వచ్చిందట. మరి ఆ పాత్ర ఏంటి? ఆ పాత్ర పై ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారు? మరి ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గోన గన్నారెడ్డి పాత్రపై హీరోలు ఆసక్తి..

ఆ చిత్రం ఏదో కాదు రుద్రమదేవి (Rudramadevi). పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీయడంలో దిట్ట అని నిరూపించుకున్నారు గుణశేఖర్ (Gunasekhar ) . అలా చిరంజీవి(Chiranjeevi) తో ‘చూడాలని ఉంది’, మహేష్ బాబు (Maheshbabu) తో ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేసిన ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం రుద్రమదేవి. ఇందులో అనుష్క(Anushka ) రానా (Rana), అల్లు అర్జున్ (Allu Arjun) కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర తర్వాత సినిమాకే హైలెట్గా నిలిచిన పాత్ర గోనగన్నారెడ్డి. ఇందులో అల్లు అర్జున్ తన నటనతో అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర పైనే మహేష్ బాబు , ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించారని కానీ అది వారి చేతుల్లో నుంచి అల్లు అర్జున్ వరకు వెళ్లింది అని సమాచారం.

also read:OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

అల్లు అర్జున్ చేయడంపై డైరెక్టర్ క్లారిటీ..

ఈ విషయంపై గుణశేఖర్ మాట్లాడుతూ.. “నాకు రుద్రమదేవి సినిమా చేయడానికి స్ఫూర్తినిచ్చిన చిత్రం ‘బ్రేవ్ హార్ట్స్’. ఈ సినిమా స్పూర్తి తోనే రుద్రమదేవి కథ చేయాలని అనుకున్నాను. అయితే డైరెక్టర్గా నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు చేయాలనుకున్నా.. ఒక్కడు తర్వాత దక్షిణాదిలో ఏ దర్శకుడికి లేనంత పెద్ద పారితోషకాన్ని నాకు ఆఫర్ చేశారు. అప్పుడే రుద్రమదేవి చేయాలని నిర్ణయించుకొని పలువురికి కథ చెప్పాను. ముఖ్యంగా కాకతీయుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. కానీ హీరోయిన్ ఓరియంటెడ్ కాకుండా హీరో నేపథ్యంగా కథ మార్చమన్నారు. దాంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా తీశాను. మొదట ఎన్టీఆర్ తో ఈ సినిమా చేద్దామనుకున్నాం. సెట్స్ పైకి వెళ్లేసరికి కథ సరిగ్గా కుదరలేదు. గన్నారెడ్డి పాత్ర అనుకున్నప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు పేర్లే ఎక్కువగా వినిపించాయి. వాళ్ళిద్దరికీ ఆ పాత్ర గురించి బాగా తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తర్వాత అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు” అంటూ గుణశేఖర్ తెలిపారు.

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×