BigTV English

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’..  ఇలా అయితే కష్టమే..!

Madharaasi Collections : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. తెలుగులో సినిమాలు రిలీజ్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. అమరన్ చిత్రంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న శివ కార్తికేయన్ మరో సినిమాతో సందడి చేయబోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తోన్న మూవీ మదరాసి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. సెప్టెంబర్ 5 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదన్న టాక్ ను సొంతం చేసుకుంది.. మరి ఇక ఆలస్యం ఎందుకు మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..


‘మదరాసి’ ఫస్ట్ డే కలెక్షన్స్..

తమిళ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో మదరాసి మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మదరాసి రిలీజ్ అయ్యింది. అయితే గతంలో రిలీజ్ అయిన అమరన్ చిత్రం అంత బజ్ అయితే ఈ సినిమాకు లేదని తెలుస్తుంది.. మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒకవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా చెప్పుకొదగ్గ రీతిలో రాలేదు.. దాంతో ఈ సినిమాకు రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడినట్లు తెలుస్తుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్లు వసూల్ చేసినట్లు టాక్.. గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 3.2 కోట్ల గా అంచనా వేస్తున్నారు.. వరల్డ్ వైడ్ 11.5 కోట్ల నెట్. 23 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది.. ఈ వీకెండు తమిళనాడులో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ పంతులు.

బిజినెస్ & టార్గెట్…

శివకార్తీకేయన్ నటించిన మూవీకి దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఏఆర్ మురగదాస్ – శివకార్తీకేయన్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో మదరాసి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఆంధ్రా, నైజాంలలో మదరాసి సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.. 200 కోట్లకు పైగా వసూలు చేస్తే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లే..


Also Read: అనుష్క గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా.. ఏంటీ ఈ కలెక్షన్లు ?

 ఓటీటీ రైట్స్..

శివకార్తీకేయన్ ప్రేమకథలే కాదు, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించుకున్నారు..అమరన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.మదరాసి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను పరిశీలిస్తే.. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మదరాసి డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది.. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాకి ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలోకి తీసుకురాబోతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుతం కనిపిస్తున్న రిజల్ట్ ప్రకారం అయితే నాలుగు వారాలకి సినిమా అనేది థియేటర్లలోకి తీసుకురాబోతున్నారని సమాచారం… దీని గురించి త్వరలోనే అధికారికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది..

Related News

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Big Stories

×