Little hearts:లిటిల్ హార్ట్స్.. 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి (Mouli) హీరోగా తొలి ప్రయత్నంలో చేసిన చిత్రం ఇది. ఎన్నో అంచనాల మధ్య ప్రీమియర్ షో తో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. దీనికి తోడు ప్రీమియర్ షో పాజిటివ్ టాక్ రావడంతో మొదటిరోజు కలెక్షన్లు కూడా ఊహించని విధంగా వస్తాయని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి మొదటి రోజే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మార్తాండను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వచ్చిన ఈ చిత్రంలో మౌళి హీరోగా నటించగా.. ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రం హీరోయిన్ శివాని నాగారం(Sivani Nagaram) హీరోయిన్గా నటించింది. వీరితోపాటు రాజీవ్ కనకాల , అనిత చౌదరి, ఎస్ ఎస్ కాంచీ, సత్య, నిఖిల్ అబ్బూరి, కృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి కలసి నిర్మించిన ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమాకి పోటీగా.. అటు అనుష్క – క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘ఘాటీ’ తో పాటు శివ కార్తికేయన్ – ఏ. ఆర్.మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ సినిమాలు కూడా విడుదలయ్యాయి.
మొదటి రోజే సరికొత్త రికార్డు..
సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చిన్న సినిమాలకు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ ఆ బడా చిత్రాలను కూడా వెనక్కి నెట్టి ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సరికొత్త సక్సెస్ తో ముందుకు దూసుకు వెళ్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అంతేకాదు మొదటి రోజే రూ.1.3కోట్ల నెట్, రూ.2.68 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. రిలీజ్ అయిన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా కూడా లిటిల్ హార్ట్స్ రికార్డ్ సృష్టించింది. ఏది ఏమైనా చిన్న సినిమా పైగా పెద్ద సినిమాల తాకిడిని తట్టుకొని.. అందులోను మొదటి రోజు బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే నిజంగా ప్రశంసనీయం అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే.. ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.
లిటిల్ హార్ట్స్ సినిమా కథ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అఖిల్ యావరేజ్ స్టూడెంట్ అని తెలిసి కూడా.. తన తండ్రి గోపాలరావు (Rajiv kanakala) మాత్రం కొడుకు(మౌళి) తో బీటెక్ చేయించి, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూడాలని కలలు కంటూ ఉంటాడు. ఎంసెట్లో ర్యాంక్ రాకపోవడంతో పెట్టాల్సిన చివాట్లు పెట్టి లాంగ్ టర్మ్ కోర్స్ చేయిస్తాడు. మరోపక్క డాక్టర్ కృష్ణారావు (ఎస్ఎస్ కాంచీ) తన కూతుర్ కాత్యాయినినీ (శివాని నారాగం) డాక్టర్ చేయాలి అని తపన పడుతూ ఉంటారు. నాలుగోసారి లాంగ్ టర్మ్ చేయిస్తాడు. అక్కడ అఖిల్ కు కాత్యాయిని పరిచయమవుతుంది. తొలిచూపు నుంచి ఆమెను ఫాలో అవుతూ ఇంప్రెస్ చేసి ప్రేమలో దింపాలి అనుకుంటున్నాడు. ఆఖరికి ఆమెను తన లవ్ లో పడేసుకుంటాడు కూడా.. ఈలోపే ఇద్దరి మధ్య ఊహించని ట్విస్ట్? మరి ఆ ట్విస్ట్ ఏంటి ? జీవితంలో వీరిద్దరూ అనుకున్నది సాధించారా? వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా? అనే సింపుల్ కథతో చాలా యూత్ ఫుల్ గా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సినిమా.
also read:Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!