Rashmika Mandanna: నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది రష్మిక (Rashmika)..కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడ ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత తెలుగులో నాగశౌర్య(Naga shourya) హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశానందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు గత మూడు సంవత్సరాలలో పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. పైగా ఈ చిత్రాలతో రూ.3500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఏ స్టార్ హీరో కూడా సాధించని రికార్డులు క్రియేట్ చేసింది రష్మిక.
మళ్లీ అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..
ఇదిలా ఉండగా ఇటీవల శేఖర్ కమ్ముల (Sekhar Kammula), నాగార్జున(Nagarjuna), ధనుష్ (Dhanush) కలయికలో వచ్చిన చిత్రం కుబేర. ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇక్కడ కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ‘రెయిన్బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిత్రాలలో నటిస్తూ ఉండగా.. ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలో మళ్లీ అవకాశం వచ్చినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ – రష్మిక కాంబినేషన్లో వచ్చిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఏ రేంజ్ లో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆ హీరోయిన్స్ తో పాటు ఈమె కూడా ఒకరు..
ముఖ్యంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది అనడంలో సందేహం లేదు. అలాంటి ఈమెకు అల్లు అర్జున్ తాను అట్లీతో చేస్తున్న సినిమాలో అవకాశం కల్పించారు అని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక కూడా ఒకరని సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రష్మిక తో పాటు దీపిక పదుకొనే (Deepika Padukone), మృణాల్ ఠాకూర్ (Mrunhal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) పేర్లు ప్రధమంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. రష్మిక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కాదు అని.. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్స్ కూడా ఆమె చేయబోతున్నారని సమాచారం.
హీరోయిన్ గా కాదు పుష్పరాజ్ ను ఢీ కొట్టే పాత్రలో..
ముఖ్యంగా పుష్ప సినిమాలో పుష్పరాజ్ తో రొమాన్స్ చేసిన ఈమె.. ఇప్పుడు అట్లీ సినిమాలో పుష్పరాజ్ నే ఢీకొట్టడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్ని రోజులు ఆన్ స్క్రీం కెమిస్ట్రీకి ఫిదా అయిన ఆడియన్స్.. వీరిద్దరి కాంబోలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో చూడాలని కూడా కోరుకుంటున్నారు.
ALSO READ:Shruti Haasan: పెళ్లిపై శృతిహాసన్ ఊహించని కామెంట్.. శిలలా మార్చేసారంటూ?