BigTV English

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Spirit: ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga).. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా తొలి ప్రయత్నంలో చేసిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. మొదటి సినిమాతోనే ఊహించని పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ఆ తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్’ అంటూ ఇదే కథను రూపొందించి మరో సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ‘యానిమల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్.. ఇప్పుడు ప్రభాస్ (Prabhas ) తో ‘స్పిరిట్’ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ కారణంగానే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కి వాయిదా పడింది.


స్పిరిట్ మూవీ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్..

సెప్టెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా రీ షూట్ జరుగుతుండడం, మరొకవైపు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వస్తున్న ‘ ఫౌజీ ‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ స్పిరిట్ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అందుకే సకాలంలో స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కావడం లేదు అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా సందీప్ రెడ్డివంగా ఈ స్పిరిట్ మూవీ పై ఇచ్చిన అప్డేట్ అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా 70% పూర్తయిందని కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలే కాలేదు అప్పుడే 70% పూర్తి ఏంటి? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సందీప్ మాటలకు ఎగిరిగంతేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..


అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈయన ప్రముఖ హీరో జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి.. కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో కలిసి వెళ్లారు. అక్కడ ఎన్నో విషయాలను పంచుకున్న ఈయన.. స్పిరిట్ మూవీపై కూడా అప్డేట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా స్పిరిట్ మూవీ అప్డేట్ విన్న ప్రభాస్ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. స్పిరిట్ మూవీ అప్డేట్ పై సందీప్ రెడ్డి మాట్లాడుతూ..” స్పిరిట్ సినిమా ఇప్పటికే 70% బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు” అంటూ స్పిరిట్ సినిమాపై అంచనాలు పెంచేశారు సందీప్ రెడ్డి వంగ.. రొమాంటిక్, హై యాక్షన్ వోల్టేజ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన సందీప్ ప్రభాస్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

వరుస లైనప్ తో బిజీగా మారిన ప్రభాస్..

ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస లైనప్ తో అత్యంత బిజీ హీరోగా మారిపోయారు. మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలతో పాటు సలార్ 2, కల్కి 2 చిత్రాలను కూడా లైన్లో ఉంచారు. ఈ చిత్రాలన్నీ కూడా ప్రభాస్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

also read:Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Related News

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Big Stories

×