Kishkindhapuri:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) దెయ్యం పాత్రలో తెరకెక్కిన తాజా మూవీ ‘కిష్కింధపురి’.. ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు. అదేంటంటే.. మనం ఏదైనా సినిమాను థియేటర్లో చూసినా లేదా ఇంట్లో చూసినా మొదట వచ్చే ఒకే ఒక్క యాడ్ ఏంటి అంటే.. ముఖేష్ యాడ్ ..
అదేనండి “ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు మూసి మరోవైపు పొగ.. ఎవ్వరు నోరు మెదపరేంటి..ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.. కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి” అంటూ ఓ భారీ డైలాగ్ తో సిగరెట్ తాగడం, పాన్,గుట్కా, తంబాకు తినడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఉదాహరణతో సహా చూపిస్తారు.. అయితే ప్రతి ఒక్క సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ యాడ్ కచ్చితంగా ఉంటుంది. కానీ తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న కిష్కింధపురి సినిమాలో మాత్రం ఈ యాడ్ ఉండదట. ఈ యాడ్ నుండి డైరెక్టర్ కౌశిక్ మనల్ని బయటపడేశారు. దానికి కారణం..అసలు ఈ సినిమాలో స్మోకింగ్ చేసే సీన్స్,డ్రింకింగ్ చేసే సీన్స్ ఒక్కటి కూడా ఉండవట.అందుకే అలాంటి సన్నివేశాలు లేనప్పుడు ఈ యాడ్ మాత్రం వేయడం ఎందుకు అని డైరెక్టర్ దీన్ని పక్కన పెట్టేసారట.
అసలు సంగతి చెప్పిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..
ఇక ఈ విషయాన్ని స్వయంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నేను మూవీ లవర్ ని.. ఒక్కరోజు ఖాళీ సమయం దొరికిందంటే చాలు.. ఆ రోజు మొత్తంలో నాలుగు సార్లు సినిమాలు చూస్తే.. నాలుగు సార్లు యాడ్ చూసి బోర్ కొడుతుంది. అందుకే ఆ యాడ్ వచ్చినప్పుడు నేను నా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా.. అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల కంటే.. యాడ్లో నటించిన ముఖేష్ పేరే అందరికీ ఎక్కువగా గుర్తుంటుంది. ఇక ఈ టార్చర్ నుండి బయట పడేయడానికే కౌశిక్ తెలివిగా ఈ సినిమాలో డ్రింకింగ్,స్మోకింగ్ సీన్లు మాత్రమే కాదు ఈ నగరానికి ఏమైంది అనే యాడ్ కూడా తీసేశారు. నిజానికి కౌశిక్ చాలా మంచి వ్యక్తి.. అతడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అందుకే తన సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
హమ్మయ్య నో ముఖేష్ యాడ్.. డైరెక్టర్ పై ప్రశంసలు
నిజానికి సినిమా స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ముఖేష్ యాడ్ చూస్తే మాత్రం.. రోజు మొత్తం అదే గుర్తుకొస్తుంది. కనీసం తిండి కూడా సరిగ్గా తినలేరు. ఎందుకంటే ఆ యాడ్ అంతలా మన మైండ్ లో మెదులుతుంది. ఈ కిష్కింధపురి మూవీలో ఆ టార్చర్ లేకుండా డైరెక్టర్ భలే తెలివిగా సినిమా షూట్ చేశారని చాలామంది ఈ విషయం తెలిసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ స్మోకింగ్,డ్రింకింగ్ లేకుండా సినిమాలు తీయడం బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కిష్కింధపురి మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సూపర్ హీరోలా.. దెయ్యం పాత్రలో నటించిన అనుపమని ఎదుర్కొనే విధంగా ట్రైలర్ లో చూపించారు. ఇక రీసెంట్ గానే పరదా అనే మూవీతో అభిమానుల మనసు గెలుచుకున్న అనుపమ.. ఆ వెంటనే కిష్కింధపురి మూవీలో దెయ్యం పాత్రతో మనల్ని భయపెట్టబోతుంది.
also read:Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు