BigTV English

Phone Charging: ఫోన్ చార్జింగ్ అయిపోయిన తరువాత.. చార్జర్ అలాగే వదిలేస్తున్నారా?

Phone Charging: ఫోన్ చార్జింగ్ అయిపోయిన తరువాత.. చార్జర్ అలాగే వదిలేస్తున్నారా?

Phone Charging: ప్రతీ ఇంట్లోనూ కనిపించే ఒక సాధారణ అలవాటు ఫోన్ ఛార్జ్ అయిపోగానే ఫోన్ తీసేసి, ఛార్జర్‌ను మాత్రం సాకెట్‌లో అలాగే వదిలేయడం. అందులో ఏముంది, ఎలాంటి నష్టం జరగదని చాలామంది భావిస్తారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల మనకు తెలియకుండా విద్యుత్ బిల్లు పెరుగుతుందని మీకు తెలుసా? ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి, అంతేకాదు పర్యావరణానికీ ముప్పు ఏర్పడుతుంది. ఈ సమస్యపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.


ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఫోన్ తీసేస్తారు కానీ ఛార్జర్ మాత్రం సాకెట్‌లో అలాగే వదిలేస్తుంటారు. కారణం ఏమవుతుంది? అని నిర్లక్ష్యం. కానీ దాని వల్ల ప్రమాదాలే కాదు, కరెంట్ బిల్లు కూడా ఎక్కవగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. ఛార్జర్‌ను ఫోన్‌కి కనెక్ట్ చేయకపోయినా, అది సాకెట్‌లో ఉంటే విద్యుత్‌ను కొద్దికొద్దిగా తీసుకుంటూనే ఉంటుంది. దీన్నే వాంపైర్ ఎనర్జీ లేదా ఫాంటమ్ లోడ్ అంటారు. ఈ విద్యుత్ వినియోగం మనకు కనబడదు కానీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

ఉదాహరణకి ఒక ఛార్జర్ నెలకు 0.1 నుండి 0.5 వాట్ల వరకు విద్యుత్ వృథా చేస్తుంది. ఇది చాలా చిన్న మొత్తమేమో అనిపించొచ్చు. కానీ మన ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు టీవీలు, ల్యాప్‌టాప్ ఛార్జర్లు, రౌటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్ని పరికరాలు సాకెట్‌లో ఉంచి వాడకపోతే కూడా విద్యుత్ పెరుగుతూనే ఉంటాయి. ఒక్క ఇంట్లోనే ఇలా ఉంటే, ఒక వీధి, ఒక పట్టణం, ఒక రాష్ట్రం ఇలా విద్యుత్ మొత్తానికి ఈ వృథా ఎంత పెద్దది అవుతుందో ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా వాంపైర్ ఎనర్జీ వల్ల ప్రతి సంవత్సరం బిలియన్ల యూనిట్ల విద్యుత్ వృథా అవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.


Also Read: CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

అమెరికాలో ఒక గణాంకం ప్రకారం ఒక్కో ఇంటి విద్యుత్ బిల్లులో దాదాపు 10 శాతం వరకు ఈ ఫాంటమ్ లోడ్ వల్లే వస్తుంది. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఒక్కో ఇల్లు నిర్లక్ష్యం చేస్తే, చివరికి అది దేశానికి పెద్ద నష్టమవుతుంది. ఇది ఆర్థిక నష్టం మాత్రమే కాదు, భద్రత పరంగానూ పెద్ద ప్రమాదం. సాకెట్‌లో ఎప్పుడూ ప్లగ్ చేసి ఉంచిన ఛార్జర్ వేడెక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా వోల్టేజ్ హెచ్చుతగ్గులు జరిగితే, కరెంట్ సర్క్యూట్. చాలా సార్లు ఇలాంటి కారణాల వల్లే ఇంట్లో అగ్నిప్రమాదాలు కూడా జరుగుతుంటాయి కానీ, మనం దానిని తేలికగా తీసిపారేస్తాం. ఛార్జర్ నాణ్యత బాగాలేకపోతే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి రాత్రి సమయంలో జరిగితే ఎంతటి అనర్థం జరుగుతుందో ఊహించుకోవచ్చు.

ఇక సాధారణ చార్జర్‌లు కూడా దీని ప్రభావం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల సర్క్యూట్‌లో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఛార్జర్ తక్కువ కాలంలోనే పాడైపోతుంది. మనం మళ్లీ కొత్త ఛార్జర్ కొనాల్సి వస్తుంది. అంటే డబుల్ ఖర్చు, విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుంది, ఛార్జర్ కూడా తరచుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఫోన్ ఛార్జ్ అయ్యాక ప్లగ్ తీసేస్తే మనకు తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది. దీంతో ఏడాది మొత్తానికి పెద్ద సేవింగ్ అవుతుంది. భద్రత పరంగా మన ఇల్లు రక్షణలో ఉంటుంది. ఛార్జర్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. పరికరాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఫోన్ ఛార్జ్ అయిపోయింది అంటే ఫోన్ మాత్రమే కాకుండా ఛార్జర్‌ను కూడా సాకెట్ నుండి తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాడని పరికరాల ప్లగ్‌లను కూడా ఆఫ్ చేయండి. సాధ్యమైతే స్మార్ట్ ప్లగ్‌లు, ఆటోమేటిక్ స్విచ్‌లు వాడండి. ఇవన్నీ మన భవిష్యత్తు కోసం రక్షణ చర్యలే.

Related News

Coconut Water: కొబ్బరి నీళ్ళు నేరుగా తాగకూడదా? అమ్మో.. ఇంత డేంజర్ అని అస్సలు తెలియదే!

Bald Head: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

Ganesh Laddu: ఒక లడ్డు.. లక్షలు కాదు కోట్లు.. ఎక్కడెక్కడ ఎంత ధర పలికిందంటే?

Tulsi Tree: తరచూ తులసి మొక్క ఎండిపోతుందా ? ఈ టిప్స్ ట్రై చేయండి

Lemon peels: నిమ్మరసం కాదు… తొక్కలే అసలు బంగారం

Big Stories

×