Sandeep Reddy: అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు దర్శకులు సందీప్ రెడ్డి(Sandeep Reddy). ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం ఇదే సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్(Prabhas) తో స్పిరిట్ సినిమా(Spirit Movie) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి తదుపరి ప్రాజెక్టుకు గురించి కూడా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) తో చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ రామ్ చరణ్ కు విపరీతంగా నచ్చడంతో సందీప్ రెడ్డితో సినిమా చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి రాంచరణ్ తో సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ సమాచారం.
ఇక ఇదే విషయం గురించి దర్శకుడు సందీప్ రెడ్డి హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇన్ని రోజులపాటు రామ్ చరణ్ ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వని సందీప్ రెడ్డి ఇప్పుడు రామ్ చరణ్ సందీప్ రెడ్డి ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి అధికారక ప్రకటన కూడా వెలుబడునున్నట్లు సమాచారం. ఇలా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ది పనులలో బిజీగా చరణ్..
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పనులను జరుపుకుంది. ఈ సినిమాని మార్చి27, 2026 న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ సందీప్ రెడ్డితో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమాని కూడా పూర్తి చేయనున్నారు. స్పిరిట్ పూర్తి అవ్వగానే సందీప్ రెడ్డి రాంచరణ్ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.
Also Read: Bhagya Shri Borse: భాగ్యశ్రీ కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలా..రామ్ లో ఉన్నాయా?