Jana Nayagan:సాధారణంగా ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. ఆడియో లాంచ్ ఈవెంట్ అయినా.. ప్రెస్ మీట్ అయినా.. ఇలా ఏదైనా సరే ఆయా భాషకు సంబంధించిన ఇండస్ట్రీలు లేదా ఆ చిత్రం ఏ ఏ రాష్ట్రాలలో విడుదలవుతుందో అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విజయ్ దళపతి(Vijay Thalapathy) మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ఏకంగా తమిళనాడులో జరపకుండా ఇంకో ప్లేస్ లో నిర్వహిస్తుండడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు టీవీకే అనే పార్టీని స్థాపించి, ఈ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఏకంగా మలేషియాలో నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 27వ తేదీన ఈవెంట్ నిర్వహించనున్నారు.
అయితే ఇక్కడే ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఇటీవల జరిగిన ప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఇది ఒక కారణమైతే మరో కారణం కూడా ఉంది. తెలుగు చిత్రాలకు అమెరికా ఎలా అయితే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందో తమిళ్ చిత్రాలకు మలేషియా కూడా అలాగే.. చాలా వరకు తమిళ చిత్రాలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సరే మలేషియా వేదికగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆడియో లాంచ్ ఈవెంట్ కోసం మలేషియాను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Anupama: అనుపమ మార్ఫింగ్ ఫోటోలు.. నిందితులు ఎవరో తెలిసిందంటూ పోస్ట్!
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్ , పూజా హెగ్డే, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఇన్ని రోజులు విజయ్ రాజకీయాల్లోకి రాకముందు చివరి చిత్రంగా కామెంట్లు చేసినా.. ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పాలి.. మరి ఈ సినిమా తర్వాత విజయ మరో కొత్త సినిమా ప్రకటిస్తారా లేక ఇదే చివరి సినిమా అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.