Mass Jathara pre release: రవితేజ (Ravi teja)హీరోగా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇలా రవితేజ సినిమాకు సూర్య అతిథిగా రావడంతో పెద్ద ఎత్తున సూర్య అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ సూర్య వద్దకు వచ్చి రవితేజ సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఇక సూర్య సమాధానం చెబుతూ రవితేజ నటించిన సినిమాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. తనకు విక్రమార్కుడు, ఇడియట్, కిక్ సినిమాలంటే చాలా ఇష్టమని సూర్య తెలిపారు.
ఇలా రవితేజ నటించిన సినిమాల గురించి చెప్పిన అనంతరం రవితేజ సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ కచ్చితంగా రీ క్రియేట్ చేయాలి అంటూ మాస్ జాతర సినిమాలోని డైలాగ్ ప్లే చేశారు ఈ సినిమాలో రవితేజ “రైల్వేలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్ లు ఉంటాయి. నేను వచ్చాక ఒకటే జోన్ అదే వార్ జోన్” అంటూ రవితేజ చెప్పే ఈ పవర్ ఫుల్ డైలాగ్ ను సూర్య ఏ మాత్రం తప్పులు లేకుండా అద్భుతంగా రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇక సుమ రవితేజను కూడా వదలకుండా సూర్య నటించిన సినిమాలోని డైలాగులు చెప్పించారు. ముఖ్యంగా రోలెక్స్ పాత్రలో సూర్య సార్ అంటూ చెప్పే డైలాగును రవితేజ రీ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ప్రతి ఒక్కరూ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా చిత్ర బృందం మాట్లాడిన తీరు చూస్తుంటే రవితేజ ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ లోడింగ్ అని చెప్పాలి.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇక ఈ సినిమాకు ప్రముఖ కథా రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొదటిసారి దర్శకుడిగా ఈయన ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి .ఇక ట్రైలర్ భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా మరోసారి శ్రీ లీల(Sreeleela) సందడి చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో మాస్ జాతర రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నాను. ఇక ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయబోతున్నారు.
Also Read: Mass jathara Pre Release: ఎక్కడికి వెళ్ళినా నీ గోలేంటీ.. సుమపై రాజేంద్రప్రసాద్ కామెంట్స్!