Dhoni-Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో తనదైన ఆట తీరుతో ధోని ఎన్నో విజయాలను అందించాడు. తన కెప్టెన్సీలో ఎంతోమందికి అవకాశాలను ఇచ్చి మంచి స్థాయికి తీసుకువచ్చాడు. అలాంటి వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన అనంతరం విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని అందించారు. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ తన ఆట తీరుతో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. దాంతో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ వరించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీని అందుకున్నారు. ధోని విరాట్ కోహ్లీ వారి కెరీర్ లో ఎన్నో మ్యాచ్లు ఆడి భారీగా డబ్బులను సంపాదించారు. కేవలం వారి ఆటతో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ధోని, విరాట్ కోహ్లీ పోస్ట్ చేసే ఫోటోలకు లక్షలలో కోట్లలో డబ్బులు అందుకుంటారు. ఇక ధోని రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఇండియాలోనే ఉంటున్నారు. విరాట్ కోహ్లీ మాత్రం లండన్ అయ్యారు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం విరాట్ కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడతానని స్పష్టం చేశారు. మ్యాచ్లు ఉన్న సమయంలో ఇండియాకు తెరిగివచ్చి తన ఆటను ముగించుకొని ఎప్పటిలానే లండన్ తిరిగి వెళ్తారు విరాట్ కోహ్లీ. ఇండియాలోనే ఉండాలని కొంతమంది చెప్పినప్పటికీ కోహ్లీ ఎవరిని పట్టించుకోకుండా సంతోషంగా లండన్ లో ఉంటున్నారు. లండన్ లో ఉండడానికి గల ప్రధానం కారణం అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా సాదాసీదా జీవితం గడపవచ్చని కోహ్లీ పేర్కొన్నారు. లండన్ లో ఉంటే వారిని ఎవరూ పెద్దగా గుర్తుపట్టరని అభిమానుల గొడవ ఉండదని కోహ్లీ అన్నారు. అందరిలానే చాలా సింపుల్ గా లండన్ లో ఉండవచ్చని బయట కూడా సంతోషంగా తిరగవచ్చని పేర్కొన్నారు. ఇండియాలో ఉంటే బయట ఎక్కడికైనా వెళ్తే అభిమానులు తెగ ఇబ్బంది పెడుతున్నారని బయటికి వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగా ఉందని ఫోటోలు, సెల్ఫీలు అడుగుతున్నారని దానివల్ల కోహ్లీ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణం చేతనే కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. అక్కడ చాలా సంతోషంగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు.
ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇండియాలోనే ఉంటున్నారు. తన అభిమానుల మధ్య ఎప్పుడూ ఉండే ధోని విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇండియాలో ధోని తన అభిమానుల మధ్య బైకుల మీద కార్లలో తిరుగుతూ ఉంటారు. టెస్టులు, t20లు, వన్డే మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపీఎల్ మ్యాచ్లను మాత్రమే ఆడుతున్నారు. ఇప్పటివరకు తన ఆటతో కోట్లలో డబ్బులను సంపాదించారు. ఇప్పటికీ ధోని పలు యాడ్స్ లలో నటిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు. పలు బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ధోని ప్రస్తుతం తన భార్య, కూతురితో కలిసి సంతోషంగా ఉంటున్నారు. అభిమానుల సందడి ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం భయపడకుండా ఇండియాలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కోహ్లీ కన్నా ధోనీకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికి ధోని ఇక్కడే ఉంటున్నారు. కోహ్లీ మాత్రం లండన్ లో సెటిల్ అయ్యారు. ఈ విషయం పైన సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. దీనిపైన విరాట్ కోహ్లీ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
got all trophies in pocket. plays seasonally for refreshment. stays away from online madness. does farming. eats 200rs black forest b'day cakes. goes on bike rides in breezy monsoons probably eating few singhaada & baalushahi on some local mishthaan bhandaar. peak life, ms dhoni! pic.twitter.com/htgXRcQgb8
— Neeche Se Topper (@NeecheSeTopper) July 9, 2024