E-Paper
Advertisement

Mohammad Rizwan: పాకిస్తాన్ బోర్డుపై రిజ్వాన్ తిరుగుబాటు.. సంత‌కం చేసేదిలేద‌ని హెచ్చ‌రిక‌

Mohammad Rizwan: పాకిస్తాన్ బోర్డుపై రిజ్వాన్ తిరుగుబాటు.. సంత‌కం చేసేదిలేద‌ని హెచ్చ‌రిక‌
Advertisement

Mohammad Rizwan: పాకిస్తాన్ క్రికెట్ లో సంక్షోభం నెలకొంది. ప్లేయ‌ర్లు వ‌ర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అన్న‌ట్లు వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఇటీవల కాలంలో మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించి, పెద్ద తప్పిదం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. షాహీన్ ఆఫ్రిదిని రంగంలోకి దించింది. మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో అద్భుతంగా పాకిస్తాన్ ప్రదర్శన కనబరిచింది. అలాంటి మహమ్మద్ రిజ్వాన్‌ పక్కన పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ కు కూడా అతను పక్కకు పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) తిరుగుబాటు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ పైన ఇప్పటి వరకు మహమ్మద్ రిజ్వాన్ సంతకం పెట్టలేదట. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Rohit Sharma ODI Ranking: 38 ఏళ్లలో నం.1 ర్యాంక్.. గంభీర్ కాదు, వాడి అమ్మ మొగుడు కూడా రోహిత్‌ ను ఆపలేడు.. 2027 వరల్డ్ కప్ లోడింగ్

మహమ్మద్ రిజ్వాన్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్సెస్ మహమ్మద్ రిజ్వాన్ మధ్య వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలోనే మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20లకు అతన్ని పక్కకు పెట్టింది. కానీ బాబర్ ఆజాంను మాత్రం సెలెక్ట్ చేశారు. దీంతో రిజ్వాన్ బాగా హ‌ర్ట్ అయ్యారు. దక్షిణాఫ్రికాపై కేవలం టెస్టుల్లో ఆడిన మహమ్మద్ రిజ్వాన్ ను టీ20లకు దూరం పెట్టడంపై అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. కొంచెం కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు అభిమానులు. అద్భుతంగా ఆడే మహమ్మద్ రిజ్వాన్ ను పక్కకు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. మహమ్మద్ రిజ్వాన్ లాంటి మంచి ఆటగాన్ని వదిలిపెట్టి, ఉస్మాన్ ఖాన్ లాంటి చెత్త వికెట్ కీపర్ ను తీసుకున్నారని ఫైర్ అవుతున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మహమ్మద్ రిజ్వాన్ తిరుగుబాటు

పీసీబీ నిర్ణ‌యం తీసుకున్న త‌రుణంలో దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్టు పైన ఇప్పటి వరకు సంతకం కూడా చేయలేదు మహమ్మద్ రిజ్వాన్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 నేపథ్యంలో తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదు ? దానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పాల్సిందే.. దానికి ఆన్సర్ చెబితేనే నేను సెంట్రల్ కాంట్రాక్టు పైన సంతకం చేస్తానని మహమ్మద్ రిజ్వాన్ తేల్చి చెప్పారట. ఇప్పటి వరకు 29 మంది ప్లేయర్లు ఈ సెంట్రల్ కాంట్రాక్టు పైన సంతకం చేశారు. కానీ మహమ్మద్ రిజ్వాన్ మాత్రం తిరుగుబాటు చేసి, సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు బుజ్జగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Also Read: Australian women cricketers: ఆస్ట్రేలియా మహిళల జట్టును గెలికిన వాడికి థర్డ్ డిగ్రీ.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.. నడవలేని పరిస్థితి

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×