Rajinikanth:ఏంటి నిజమా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారా అని అంటే.. అవును అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసి రజినీ రెస్ట్ తీసుకోనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఆయన ఎదిగిన ప్రయాణంలో ఎన్నో అంటే ఎన్నో అడ్డంకులు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలో శిఖరంలా నిలబడ్డాడు. తలైవాలాగా కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ దక్కుతుంది అని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
ఇప్పటివరకు రజినీ 170 కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తన సత్తా చాటాడు. 74 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా నిలబడుతున్నాడు. ఈ ఏడాది కూలీ సినిమాతో వచ్చిన రజినీ .. తెలుగువారిని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా మారాడు. కూలీ తరువాత రజినీ.. జైలర్ 2 తో బిజీగా మారాడు.
ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసి రజినీ.. కమల్ హాసన్ తో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా రజినీ – కమల్ మల్టీస్టారర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించేది ఎవరు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇక డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ కు కూడా ఈ ప్రశ్న ఎదురవ్వగా.. తాను ఏ సినిమాకు దర్శకత్వం వహించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రదీప్ ఈ సినిమాకు డైరెక్టర్ కాదని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఈ మల్టీస్టారర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాపైనే నెల్సన్ కూర్చోనున్నాడట. ఆ లెక్కన 2027 లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమానే రజినీ చివరి సినిమా అని కోలీవుడ్ లో పుకార్లు మొదలయ్యాయి. రిటైర్మెంట్ తీసుకోవాలని మొదట అనుకునే చివరి సినిమా గుర్తుండిపోయేలా కమల్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రిటైర్మెంట్ కు కారణం.. రజినీ అనారోగ్య సమస్యలే అని, సినిమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.