Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి చెప్పిన మాదిరిగానే ఇది ఒక రణరంగం. కొంతమంది హౌస్ మేట్స్ బయటకు వెళ్ళిపోయారు అనుకునే తరుణంలో మళ్లీ వాళ్లలో ఇద్దరికీ లోపలికి వచ్చే అవకాశం కూడా దక్కింది. నామినేషన్స్ అనేవి ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్.
నామినేషన్స్ లో భాగంగా ఆల్రెడీ హౌస్ నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి చేయటం అనేది కొసమెరుపు. అయితే ఆ ప్రక్రియలో ఎక్స్ హౌస్ మేట్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలానే భరణి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
భరణి హౌజ్ లోకి వచ్చాక దివ్యని అవైయిడ్ చేశాడు. తనతో మంచి బాండింగ్ ఉంది. నామినేషన్ చేసిన రీతూ, సంజనలతో మళ్లీ ఎలా మాట్లాడవంటూ దివ్యని అన్నాడు. అప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు గురించి మాట్లాడుకుంటు ఎమోషనల్ అయ్యారు.
అంత బాండింగ్ ఉన్న భరణి తిరిగి హౌజ్ లోకి వచ్చాక దివ్యతో అంటి ముట్టనట్టు ఉన్నాడు. నామినేషన్ లో తనకు కత్తి ఇవ్వమని అడిగిందట దివ్య. కానీ, తనకి ఇవ్వకుండ నిఖిల్ కి ఇచ్చాడు.
నామినేషన్ అయిపోయి బయటకు వెళ్లేటప్పుడు తనకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాక కూడా దివ్యతో పెద్దగా మాట్లాడలేదు. కానీ, తనూజ మాత్రం అదే బాండ్ చూపించాడు. పైగా నీ గేమ్ బాగుంది ఏలాంటి బాండ్స్ పెట్టుకోవద్దు అంటూ సలహా ఇచ్చాడు.
ఆ తర్వాత ఎప్పటికో దివ్య దగ్గరి వెళ్లి నువ్వు అంత స్ట్రాంగ్ కదా.. నా విషయానికి వచ్చేసరికి ఎందుకంత వీక్ అవుతున్నావంటూ ప్రశ్నించాడు. చూస్తుంటే భరణి, దివ్యని పక్కన పెట్టాడు కారణం ఏంటీ, బయటకు వెళ్లాక ఏం జరిగింది. భరణికి ఏం తెలిసిందో.? ఈ వారం రోజుల్లో బయట నుంచి గేమ్ చూశారు కాబట్టి దివ్య గేమ్ లో ఏమైనా గమనించాడా? భరణి గురించి దివ్య తక్కువ చేస్తూ ఏమైనా మాట్లాడిందా.? అనే సందేహాలు మొదలయ్యాయి.
కానీ, భరణి అలా ఉన్నందుకు దివ్య చాలా ఏడ్చింది. అన్న నాతో మాట్లాడలేదు.. అసలు ఆయన ఎందుకు అలా ఉన్నారు. తన ఎలిమినేషన్ కి నేనే కారణం అనుకుంటున్నాడ అని దివ్య ఇన్ సెక్యూర్ ఫిల్ అవుతుంది.
Also Read: Naga Vamsi : ఈసారి ఏం జరిగినా కూడా దుబాయ్ అయితే వెళ్ళను, నాగ వంశీ కౌంటర్ వాళ్లకేనా?