Mass Jathara Event : మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా మాస్ జాతర. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ కు సూర్య గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సినిమా ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. ముందుగా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ చెప్పారు. భీమ్స్ ఎమోషనల్ స్పీచ్ విన్న తర్వాత ఇంత ఎమోషనల్ అయిపోయావే ఏంటయ్యా బాబు. నీ ఎమోషన్ తగలయ్యా అని రవితేజ టైమింగ్ కు అన్నారు. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు.
స్పీచ్ అంత అయిపోయిన తర్వాత రవితేజ మాట్లాడుతూ సారీ అబ్బాయి మర్చిపోయాను. గత సినిమాలతో మీకు విపరీతంగా చిరాకు తెప్పించాను ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈ సినిమాతో అది జరగదు ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని అభిమానులకు ఒక హోప్ ఇచ్చాడు మాస్ మహారాజా.
నవీన్ చంద్ర ఈ సినిమాలో శివుడు అనే పాత్రను ప్లే చేశాడు. సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలానే స్టేజ్ పైన నవీన్ చంద్ర డాన్స్ ఇరగదీసావ్ అంటూ ప్రశంసలు అందించారు. రేపు శివుడు అనే క్యారెక్టర్ గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు నవీన్ చంద్ర ఇరగదీసాడు. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అదిరిపోతాయి.
రాజేంద్రప్రసాద్ గారితో రాజా ది గ్రేట్ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత ఈ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్. శ్రీ లీలా నాది కాంబినేషన్ మరోసారి హిట్ అవ్వబోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు సరికొత్త లీలా చూడబోతున్నారు. మాసి క్యారెక్టర్. సూర్య కంటే ఎక్కువగా నేను వాళ్ళ తమ్ముడు కార్తీ తో కలుస్తుంటాను. ఇప్పుడు కలిసిన తర్వాత ఈయనను కూడా ఇకపై కలుస్తానేమో అనిపిస్తుంది. ఈ సినిమాతో మరో టాప్ దర్శకుడు పరిచయం అవుతున్నాడు అంటూ దర్శకుడు భాను గురించి చెప్పారు.
Also Read: Mass Jathara Event : నాగ వంశీ ను మించిన రివ్యూ రైటర్స్ లేరు, దర్శకుడు సంచలన కామెంట్స్