IPL 2026: ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఐపీఎల్ 2026 పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ఇప్పటి నుంచే అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ 15వ తేదీ లోపు జట్టు నుంచి వేలంలో వదిలేసే ప్లేయర్ల లిస్టును ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో భాగంగానే, ఫ్రాంచైజీలు కూడా ఆ ప్లేయర్ల లిస్టును తయారు చేస్తున్నాయి. మరికొన్ని జట్లు ట్రేడింగ్ ద్వారా.. ఇతర జట్ల ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని జట్లు మాత్రం మినీ వేలంలోకి వచ్చిన ప్లేయర్లను ఎగిరేసుకుపోవాలని చూస్తున్నాయి.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ మాసంలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 15వ తేదీన ముంబైలో ఈ మినీ యాక్షన్ నిర్వహించనున్నారట గతంలో విదేశాల్లో నిర్వహించిన వేలాన్ని ఈసారి మాత్రం ముంబైలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. తమ జట్టుకు సంబంధించిన దీపక్ చాహర్, తిలక్ వర్మను సన్రైజర్స్ హైదరాబాద్ కు ఇచ్చేస్తామని వెల్లడించిందట ముంబై ఇండియన్స్.
ఆ ప్లేస్ లో ఇషాన్ కిషన్ తో పాటు నితీష్ కుమార్ రెడ్డిని ఇవ్వాలని కోరిందట ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ ను కచ్చితంగా ఇవ్వాల్సిందేనని కాస్త ఫోర్స్ కూడా చేసిందట. అవసరమనుకుంటే ఎక్కువ డబ్బులు కూడా ఇస్తామని తెలిపిందట. అయితే ఈ ఆఫర్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తమ జట్టుకు ఏ ప్లేయర్ అవసరమే లేదు.. మా జట్టు నుంచి ఎవరిని వదులుకునేది లేదు అంటూ కావ్య మారన్ తేల్చి చెప్పారట. ముంబై ఇండియన్స్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట కావ్య పాప.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన ఇషాన్ కిషన్ కు మంచి డిమాండ్ లభిస్తోంది. అతన్ని కొనుగోలు చేసేందుకు ముంబై ఇండియన్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ అలాగే కేకేఆర్ జట్టు కూడా పోటీ పడుతున్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన అనుభవం ఇషాన్ కిషన్ కు ఉంది. కాబట్టి అతన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అంబానీ. అదే సమయంలో కేకేఆర్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడుతున్నాయి. ఇక సంజు శాంసన్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.