Mass Jathara Event : ప్రస్తుతం చాలా సినిమాలుకు సంబంధించిన న్యూస్ లు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. కేవలం మామూలు జనాభా మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాను విపరీతంగా వాడుతారు. వాళ్లను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ల సినిమా ప్రమోషన్స్ కి సోషల్ మీడియాను విపరీతంగా వాడుతుంటారు. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తారు.
అలా సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన వ్యక్తి నిర్మాత నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సినిమాలు నిర్మించే నాగ వంశీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల పైన తన ఒపీనియన్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. తనలో కూడా ఒక ఆడియన్ ఉండటం వలన సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలుపెడతారు. గతంలో అవతార్ సినిమా గురించి నాగవంశీ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పుడు తనని బాగా ట్రోలింగ్ కూడా చేశారు.
ట్విట్టర్ ఎక్కువగా వాడే వాళ్ళకి ప్రత్యేకించి నాగ వంశీ నిక్ నేమ్ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో చాలామంది నాగవంశీ ని చింటూ అని పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ పేరును నాగవంశీ కి పెట్టారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా టైంలో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్లో మొదటిసారి ఎన్టీఆర్ మాట్లాడుతూ చింటూ అని నాగ వంశీ ను పిలిచారు.
అయితే అప్పుడే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఆ పేరు అంతవరకు ఎలా రీచ్ అయింది అని అందరూ అనుకున్నారు. ఇక తాజాగా నాగ వంశీని చింటూ అంటూ స్టేజ్ పైన మరోసారి పిలిచాడు మాస్ మహారాజ రవితేజ. తన గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పను. సక్సెస్ మీట్ లో మాట్లాడుతాను అంటూ రవితేజ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 31ని వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ లో ఎటువంటి అంశాలు అయితే ప్రేక్షకులు ఇష్టపడతారో వాటన్నిటిని అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు భాను. రచయితగా మంచి పేరు సంపాదించుకున్న భాను ఈ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు.
రవితేజ కూడా భాను గురించి మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు వచ్చాడు అంటూ ప్రశంసించారు. అలానే భాను దగ్గర చాలా కథలు కూడా ఉన్నాయి అని రవితేజ చెప్పారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత భాను ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తాడు ముందు ముందు తెలుస్తుంది.
Also Read: Naga Vamsi : ఈసారి ఏం జరిగినా కూడా దుబాయ్ అయితే వెళ్ళను, నాగ వంశీ కౌంటర్ వాళ్లకేనా?