BigTV English
Advertisement

Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్

Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్


Bigg Boss 9 Day 51 Episode Review: శ్రీజ మాటలకు మాధురి హర్ట్ అయ్యింది. నామినేషన్ తర్వాత పక్కకు వెళ్లిన మాధురి భాధతో కన్నీరు పెట్టుకుంది. దీంతో తనూజ బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటది ఏడవకు అంటూ ఓదార్చింది.  ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు శ్రేష్టి వర్మ, భరణిలు వచ్చారు. హౌజ్ లోకి వచ్చిన శ్రేష్టి వర్మ.. హౌజ్ లో అందరు ఓ క్లారిటీ తో ఉన్నారు. ఒక్క నీకే లేదు. కండ బలం ఉంది కానీ, బుద్ది బలం లేదంటూ డిమోన్ పవన్ ని నామినేట్ చేసింది. మరో కత్తిని రాము రాథోడ్ కి ఇవ్వగా.. అతడు గౌరవ్ ని చేశాడు. ఆ నెక్ట్స్ భరణి వచ్చాడు. ఆమె ఆట తీరు మార్చుకోవాలని చెబుతూ సంజనని నామినేట్ చేసి మరో కత్తిని నిఖిల్ ఇవ్వగా అతడు తనూజని నామినేట్ చేశాడు. మాధురి డైరెక్టర్ నామినేట్ అవ్వడంతో ఈ వారం బయటకు వెళ్లేవారిలో తనూజ, రీతూ, మాధురి, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, సంజన, డిమోన్ లు నామినేషన్ లో నిలిచారు.

తనూజపై గురించి గుసగుసలు

ఆ తర్వాత తనూజ గురించి ఇమ్మాన్యుయేల్ రీతూ, డిమోన్ లతో గుసగుసలాడాడు. టాస్క్ లో ఎంత సపోర్టు చేసిన నామినేషన్ అనగానే నాకంటు ఎవరూ లేరు అంటుంది. తన పేరు చెప్పి నా దగ్గర స్లిప్ తీసుకున్నాడు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేనే పరాయి వాడిని అయ్యాను అని చెబుతూ ఫీల్ అయ్యాడు. ఇక హౌజ్ లో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ టైం వచ్చింది. భరణి, శ్రీజల లోపలికి తీసుకువచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే హౌజ్ లో కొనసాగుతారని ట్విస్ట్ ఇచ్చాడు. ఉండాలి అనుకున్న కంటెస్టెంట్ గురించి చెబుతూ వాళ్లు ఏం మార్చుకోవాలి, ఎలా ఉండకూడదు చెప్పాలని చెప్పాడు. ఎవరూ ఎవరూ ఉండాలనుకుంటున్నారో వారి నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. దివ్య వచ్చిన భరణిని అతి మంచితనం మానుకోమని చెప్పింది. ఆ తర్వాత గౌరవ్.. భరణికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాడు. కానీ దాన్ని భరణి తిరస్కరించాడు.


మైండ్ యువర్ వర్డ్స్

మాధురి.. శ్రీజకు మైండ్ యువర్ వర్డ్స్ అని సూచించింది. హౌజ్ ఉండాలంటే మాటలు కంట్రోల్ లో ఉండాలి. నీకు అది లేదు, మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్, ఏం మాట్లాడుతున్నావే క్లారిటీ ఉండదు నీకు అని చెబుతుంది. మాధురి.. సలహాను శ్రీజ తనదైన స్టైల్లో కొట్టిపారేసింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమన్నారు కదా.. నేను అయితే ఏం మాట్లాడుతున్నాఅనే దానిపై క్లారిటీతోనే ఉంటాను. మీలా అయితే నేను మాట్లాడలేను అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత మాధురి పాయింట్స్ ని తాను యాక్సెప్ట్ చేయనంటూ ఖండించింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ శ్రీజ సపోర్టు చేస్తున్నా అని చెప్పి.. అనవసరమైన ఆర్గ్యూమెంట్ తగ్గించుకుంటే మంచిది అని చెప్తాడు. ఆ తర్వాత గౌరవ్ భరణికి చెప్పిన పాయింట్స్ పై దివ్య అతడిని ప్రశ్నించింది. నువ్వు అలా ఎలా అంటావని అడగ్గా.. అది నా గేమ్ అంటాడు. అక్కడ నేను కూడా ఉన్న అంటూ దివ్య గౌరవ్ తో గొడవ పడింది. ఇదంత చూస్తుంటే ఆమె భరణికి స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది.

దివ్యని అవైయిడ్ చేస్తున్న భరణి

దీంతో అతడు చెప్పాగానే నేను గట్టిగానే సమాధానం ఇచ్చాను. ఇప్పుడు దివ్య ఎందుకు అడుగుతున్నావ్ అంటే అది మీ కోసం కాదు. నా పాయింట్ అక్కడ నేను కూడా దీనికి మీకు సంబంధం లేదు అంటుంది. కానీ, వచ్చినప్పటి నుంచి భరణి దివ్యని అవైయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటి నుంచి చివరికి ఎలాంటి డిస్ట్రక్ట్ లేకుండ భరణితో ఉన్న దివ్యని పట్టించుకోకుండ తనూజతో మాత్రమే మాట్లాడాడు. భరణి తనని అవైయిడ్ చేస్తుండటం దివ్య ఏడ్చింది. దీంతో నాన్న అసలు నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోడం లేదంటూ ఎమోషనల్ అవుతుంది. మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పగా.. మీలా అయితే నేను మాట్లాడలేను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది శ్రీజ. దానికి మాధురి అవును తెలుస్తుంది అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య గొడవ స్టార్ట్అయింది. ఈ పాయింట్​ని శ్రీజ యాక్సెప్ట్ చేయనంటూ చెప్పింది. అయితే సోషల్ మీడియాలో భరణికి ఇన్​డైరెక్ట్​గా సపోర్ట్ చేస్తూ.. శ్రీజకు ఇలా రాసింది మాధురి అంటూ మీమ్స్ వేస్తున్నారు.

Related News

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Bigg Boss 9: ఈ వారం నామినేషన్ లో మొత్తం 8 మంది.. వాళ్లు ఎవరెవరంటే

Bigg Boss 9 : నాన్న మారిపోయాడు.. దివ్యని అవైయిడ్ చేసి తనూజతో.. అసలేం జరిగింది

Bigg Boss 9 : బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం, హోస్ట్ గా నాగార్జున ఇక లేనట్లేనా?

Bigg Boss 9 Promo : అన్నా చెల్లి.. ఓ తెలుగు రాని అబ్బాయ్, దివ్య స్మార్ట్ గేమ్ ఆడుతుందా?

Bigg Boss 9 Bharani: హౌస్‌లో భరణికి తీవ్రగాయాలు.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు

Bigg Boss 9 Promo : మాధురి vs శ్రీజ… ఆ నోళ్ల మోతను భరించాల్సిందేనా…

Big Stories

×