Jr NTR: భారతీయుల ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన సంగతి తెలిసిందే. భారత మహిళ క్రికెట్ జట్టు ఎన్నో సార్లు ఫైనల్ కు వెళ్లి వరల్డ్ కప్ లో నిరాశను ఎదుర్కొంది. అయితే 2025 వరల్డ్ కప్ లో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరడంతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విజయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా భారత మహిళా జట్టు వరల్డ్ కప్ (Women world Cup)సొంతం చేసుకోవడంతో సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ విజయం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ఎన్టీఆర్, వెంకటేష్, రాజమౌళి వంటి తదితరులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు ఎన్టీఆర్ (NTR)ఈ మహిళా జట్టును ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పందిస్తూ..ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచినందుకు భారత మహిళల జట్టుకి అభినందనలు. ఎంతో ధైర్యంతో పోరాడుతూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం పట్ల భారతీయులందరూ మీకు సలాం కొడుతున్నారు అంటూ ఈయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ చాట్ జీపీటీ (Chat Gpt)సహాయంతో చేసినదని తెలియడంతో ఈయన పట్ల విమర్శలు వస్తున్నాయి. స్కూల్ కి వెళ్లి చదువుకునే టైం ఆసన్నమైంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొంతమంది ఇలా దొరికిపోయావు ఏంటి అన్న అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలు ఈ చాట్ జిపిటి ఉన్నదే మన పనిని సులభంగా చేసుకోవడానికి అలాంటిది తారక్ దీనిని ఉపయోగించి ట్వీట్ చేస్తే తప్పేంటి అంటూ కూడా ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
🤣🤣🤣🤣 https://t.co/iKHLkB5W0K pic.twitter.com/xRd1Ok1tXK
— Ran Vijay Singh (@sanskarian33) November 2, 2025
ప్రస్తుతం తారక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) డ్రాగన్(Dragon) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 2027 లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక రుక్మిణి వసంత్ ఇటీవల కాంతార చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Kantara1: ఓటీటీలోకి వచ్చినా ఆగని కాంతార 1 కలెక్షన్ల సునామి.. అక్కడ సరికొత్త రికార్డు!