Super Star Krishna Statue Removed: దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్కి బిగ్ షాక్ తగిలింది. విశాఖలోని జగదాంబ సెంటర్లో ప్రతిష్టించిన కృష్ణ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. జనసేన నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జగదాంబ సెంటర్లోని కృష్ణ విగ్రహాన్ని తొలగించినట్టు సమాచారం. తమ అభిమాన హీరో విగ్రహం తొలగించడం స్థానిక అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో కృష్ణ విగ్రహం తొలగింపు వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
అయితే జనసేన నేతల జీవీఎంసీలో ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జగదాంబ సెంటర్లోని కృష్ణ విగ్రహాన్ని తొలగించినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో జనసేన ఒత్తిడితో కృష్ణ ఫ్యాన్స్ ధర్నాలు, నిరసనలకు వెళ్లలేదు. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ జెండా ఉన్న ప్రదేశంలో కృష్ణ విగ్రహం పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆయన ఓ ట్వీట్ చేశారు. పార్టీ జెండా ఉన్నప్పుడు, తొలగించిన రెండు ఫోటోలు తన ట్వీట్కి జత చేశారు.
‘జగదాంబ జంక్షన్‌లో జనసేన పార్టీ జెండా ఉన్న ప్రదేశంలో వెనుక జనసేన సిద్ధాంతాలు గోడపై రాసి ఉండేవి (మొదటి ఫోటో). వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జెండాను తొలగించడానికి ప్రయత్నం చేశారు అది విఫలమైంది. అక్కడ జనసేన జెండా స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించింది. అక్కడ పార్టీ ఎమ్మెల్యేగా వంశీ కృష్ణ గారిని ప్రజలు గెలిపించుకున్నారు. కానీ, సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నేరం. అసలైన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఇలాంటి తప్పులు చేయరు.
Also Read: SSMB29 Title Launch: జక్కన్న పక్కా ప్లాన్… ప్రొమోను 30 కోట్ల మంది చూశారు!
కానీ, ముంథా తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ కార్యక్రమాలలో ప్రజలు, జనసేన నాయకులు, విశాఖ జీవీఎంసీ అధికారు లు నిమగ్నమై ఉన్న సమయంలో జనసేన పార్టీ జెండాను తీసేసి, జెండా దిమ్మను తొలగించడమే కాకుండ వెనుక గోడపై ఉన్న పార్టీ సిద్ధాంతాలపై సున్నం వేసి, అదే ప్రదేశంలో అనుమతి లేకుండా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి రెండో ఫోటో కూడా షేర్ చేశాడు. ఇది పెద్ద కుట్ర పూరితమైన నేరం, చట్ట విరుద్ధం. దీనిపై నేను మరోసారి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాకుండా, అధికారులు తక్షణమే స్పందించి అక్కడ తొలగించిన జనసేన జెండాను పునఃస్థాపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను‘ అని ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చారు.