Kantara 1: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) తాజాగా నటించిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా అన్ని భాషలలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా కాంతారా సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక వైపు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న థియేటర్లలో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.
ఇప్పటికీ కాంతార1 కలెక్షన్ల సునామి ఆగలేదని చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో హీరోగా నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2(KGF 2) రూ. 250 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్లను కాంతార 1 క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 850 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.
కన్నడలో 250 కోట్లకు పైగా తెలుగులో కాంతార1 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఇక హిందీలో ఈ సినిమా ఏకంగా 212 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఊహించని ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కన్నడలో ఇప్పటివరకు అత్యధిక వసూలు రాబట్టిన కేజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టడంతో అభిమానులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పటికైనా కాంతార 1 కలెక్షన్లకు బ్రేకులు పడతాయా? లేదంటే ఇదే జోరు కనబరుస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
హనుమంతుడి పాత్రలో రిషబ్..
ఇక కాంతార సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు రిషబ్ వెల్లడించారు. అయితే ఈ సినిమాలు మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన ఇదివరకు కమిట్ అయిన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా రిషబ్ శెట్టి వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ సినిమాలో ఈయన ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరొక తెలుగు సినిమాకి కూడా కమిట్ అయ్యారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది.
Also Read: Devi sri prasad: పెళ్లిపై ఓపెన్ అయిన దేవి శ్రీ… మొదటి ప్రాధాన్యత దానికే అంటూ!