Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఈడీ అతని గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కి పైగా ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్య అక్టోబర్ 31న పీఎంఎల్‌ఏ సెక్షన్ కింద జారీ చేసిన ఆర్డర్ల ఆధారంగా ఈ చర్య జరిగింది. ఈ మేరకు నాలుగు అటాచ్‌మెంట్ ఆర్డర్లు జారీ చేసిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఈ కేసు ప్రధానంగా ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సిఎఫ్‌ఎల్‌లకు సంబంధించినది. 2017-2019 మధ్య యెస్ బ్యాంక్ ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌లో రూ.2,965 కోట్లు, ఆర్‌సిఎఫ్‌ఎల్‌లో రూ.2,045 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అయితే, 2019 డిసెంబర్ నాటికి ఇవి ఎన్‌పీఏగా మారాయి, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.1,353.50 కోట్లు, ఆర్‌సిఎఫ్‌ఎల్‌కు రూ.1,984 కోట్లు మాత్రమే డొడ్లు ఉన్నాయి. ఈడీ దర్యాప్తులో ఈ డబ్బులు అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన ఎంటిటీలకు డైవర్ట్ చేసి, లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే సెబీ మ్యూచువల్ ఫండ్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్స్ ప్రకారం, రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ అనిల్ అంబానీ గ్రూప్ ఫైనాన్షియల్ కంపెనీలలో నేరుగా పెట్టుబడులు పెట్టలేదు. కానీ, పబ్లిక్ మనీని యెస్ బ్యాంక్ ఎక్స్‌పోజర్‌ల ద్వారా పరోక్షంగా రూట్ చేసి, గ్రూప్ కంపెనీలకు చేర్చారని ఈడీ ఆరోపించింది. ఈ ప్రక్రియలో రూ.12,600 కోట్లు కనెక్టెడ్ పార్టీలకు డైవర్ట్ చేసి, రూ.1,800 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టి, తర్వాత లిక్విడేట్ చేసి మళ్లీ గ్రూప్‌కు రూట్ చేశారని ఆరోపణ. అదనంగా, బిల్ డిస్కౌంటింగ్ మెకానిజమ్‌ను మిస్‌యూజ్ చేసి, రిలేటెడ్ పార్టీలకు డబ్బులు చలాయిక చేశారని ఈడీ తెలిపింది.
ఈ కేసు సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జరుగుతోంది. సీబీఐ ప్రకారం, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మోసం చేసి, మొత్తం రూ.17,000 కోట్లకు పైగా డైవర్షన్ చేశాయి. ఇందులో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండ రూ.13,600 కోట్లు ఎవర్‌గ్రీనింగ్ లోన్‌ల ద్వారా మోసం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అనిల్ అంబానీకి బిగ్ షాక్..!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు
ఈ మేరకు ఆస్తులను అటాచ్… pic.twitter.com/A63nWHlVe5
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025