Shiva Movie: ప్రముఖ సంచలనాత్మక, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వర్మ హిట్ సినిమాలలో ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలలో శివ సినిమా(Shiva Movie) ఒకటి. ఈ సినిమా 1990వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలయి 35 సంవత్సరాల ను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని మరోసారి 4కె వర్షన్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం అని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాని నవంబర్ 14వ తేదీ విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శివ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో దివంగత నటుడు రఘువరన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే రఘువరన్ దగ్గర పని చేసే రౌడీలలో గణేష్ పాత్రలో విశ్వనాథ్ అనే వ్యక్తి నటించారు. నిజానికి ఈ విశ్వనాథ్ పాత్రలో ముందుగా మోహన్ బాబు(Mohan Babu) ను అనుకున్నారట. హీరోకి వార్నింగ్ ఇచ్చే సీన్ పవర్ ఫుల్ గా ఉండాలి అంటే ప్రజలకు బాగా తెలిసిన నటుడు అయితే బాగుంటుందని నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ సూచించారట.
ఇలా అక్కినేని వెంకట్ మోహన్ బాబు పేరును సూచించడంతో వెంటనే వర్మ వద్దని రిజెక్ట్ చేశారట. ఇలా వర్మ మోహన్ బాబును రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు. మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీ హీరోగా బాగా సుపరిచితమే అయితే ఆయన చెప్పే ప్రతి ఒక్క డైలాగుకు సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుందని, ఇలాంటి ఒక హీరో రౌడీ పాత్రలో నటిస్తే.. అక్కడ ప్రేక్షకులు రౌడీని చూడరని కేవలం మోహన్ బాబుని చూస్తారని తెలియజేశారట. ఇలా మోహన్ బాబుని ఈ పాత్రలో కనుక తీసుకుంటే సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులకు రీచ్ అవ్వదని అందుకే వర్మ మోహన్ బాబు పాత్రను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో..
ఇలా ప్రేక్షకుల నాడిని దృష్టిలో పెట్టుకొని వర్మ మోహన్ బాబును రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే వర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే శివ సినిమా మంచి సక్సెస్ అందుకుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని తిరిగి నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక శివ సినిమాలో నాగార్జునకు జోడిగా అమల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.
Also Read :Jr.NTR: ఉమెన్ వరల్డ్ కప్ పై తారక్ ట్వీట్…అడ్డంగా దొరికిపోయావ్ ఏంటన్నా?