SSMB29 Title Launch Event: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది మహా దర్శకులు ఉన్నారు. వందల్లో సినిమాలు చేసి హిట్స్, బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినవాళ్లు ఉన్నారు. కానీ తెలుగు దర్శకుల్లో రాజమౌళి వేరు. ప్రస్తుతం అందరు నోట వస్తున్న మాట. అంతేకాదు ఈవిషయం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా అవును అనాల్సిందే. చేసింది. పదకొండ, పన్నెండు సినిమాలే. కానీ, ఇండియా సినిమాకు రారాజుగా ఉన్నాడు జక్కన్న. దీనికి సినిమా పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, విజన్. ప్రతి షాట్లో పర్ఫెక్షన్ ఉండాల్సిందే. ఆయన సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి లీడ్ యాక్టర్స్ ప్రతి ఒక్కరిని స్టడీ చేసి తీసుకుంటున్నారు.
పాత్ర డిజైన్ చేయడమే కాదు.. దానికి వందశాతం న్యాయం చేసే నటులనే ఎంపిక చేసుకుంటాడు. ప్రతి చిన్న నటుడి షాట్ కూడా పర్ఫెక్ట్ ఉండాలనుకుంటున్నారు. అందులే లేటు ఆయన పర్ఫెక్ట్ అవుట్‌ఫుట్ ఇస్తాడు. ఆ నిబద్ధత ఇంతవరకు జక్కన్నకు ఫెయిల్యూర్ లేకుండ చేసింది. ఒక సీరియల్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు ఇండియన్ సినిమానే శాసించే స్థాయికి వెళ్లడం అంటే అసాధ్యం. కానీ, అది సాధ్యం చేసి చూపించాడు జక్కన్న. సినిమా మేకింగ్లోనే కాదు ప్రమోషన్స్లోనూ ఆయన శైలి డిఫరెంట్. మూవీ ప్రకటన నుంచి ప్రమోషన్స్ వరకు సరికొత్తగా ప్లాన్ చేస్తాడు. అలాగే SSMB29 కోసం రాజమౌళి డిఫరెంట్ ప్లాన్ చేశాడు.
ఈ నెల నవంబర్ 15న లాంచ్ చేసి టైటిల్, ఫస్ట్ లుక్ కోసం జక్కన్న సరికొత్తగా ప్రమోషన్ ప్లాన్ చేశాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రొమోతో గ్లోబల్ అటెన్షన్ కొట్టేశాడు. జక్కన్న మార్కెట్ స్ట్రాటజీ చూసి అంత సర్ప్రైజ్ అవుతున్నారు. తన సినిమా అప్డేట్స్ నుంచి ప్రమోషన్ వరకు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటాడు. ఇండియన్ సినిమాకు పాన్ ఇండియా ట్రెండ్ని పరిచయం చేసిన జక్కన్న ఇప్పుడు పాన్ వరల్డ్ అంటూ అతి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబల్ ట్రోటర్ అంటూ విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఇండియన్ మూవీ లవర్సే కాదు విదేశీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడో సెట్స్పైకి వచ్చిన ఈ మూవీపై ఇప్పటికీ ఆఫీషియల్ గా ఒక్క అప్డేట్ లేదు. కానీ, సినిమాకి ఉన్న బజ్ మామూలుగా లేదు. ఇంటర్నేషనల్ స్థాయిలో SSMB29 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నవంబర్లో ఈ సినిమా సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి రామోజీ ఫిలిం సిటీ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష వారకు అభిమానులు పాల్గొనన్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ప్రమోషన్ కోసం ఇంటర్నేషన్ ప్లాట్‌ఫాంని వేదిక చేసుకున్నాడు.
అదే ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ ఈ లైవ్లో SSMB29 టైటిల్ లాంచ్‌ని ఈవెంట్ని ప్రమోట్ చేశాడు. ఈ మ్యాచ్ ముగిసేలోపల ఈ లైవ్ స్ట్రీమ్‌పై సుమారు 100కు పైగా ప్రొమో ప్లే అయ్యింది. ఈ దెబ్బతో SSMB29 టైటిల్ లాంచ్ ఈవెంట్ ఇంటర్నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసే లోపల మొత్తం 30 కోట్ల మంది ఈ ప్రొమోను వీక్షించినట్టు తెలుస్తోంది. జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ చూసి ఇండస్ట్రీ వర్గాలంత నోళ్లు వెళ్లబెట్టారట. రాజమౌళి విజన్ని అంచన వేయడం అంత ఈజీ కాదంటూ కాలర్ ఎగిరేస్తున్నారు ఫ్యాన్స్. SSMB29 కోసం ఆయన మార్కెటింగ్ మాస్టర్‌స్ట్రోక్ అంత సర్ప్రైజ్ అవుతున్నారు. మరి రాజమౌళి-మహేష్ సినిమాలంటే ఈ రేంజ్ సర్‌ప్రైజ్‌లే కదా అభిమానులు కోరుకునేది.