Nag Ashwin:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా ఊహించని విజయాలను సొంతం చేసుకుంటూ.. తన చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మరోసారి తండ్రి కాబోతున్నాను అంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ మేరకు నాగ్ అశ్విన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన భార్య , ప్రముఖ మహిళా నిర్మాత ప్రియాంక దత్ అలాగే తమ కుమారుడు రిషి తో కలసి దిగిన ఫ్యామిలీ ఫోటోని ఆయన షేర్ చేశారు. ఇందులో ఒక కుర్చీలో కూర్చున్న ప్రియాంక దత్.. తన బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ప్రియాంక దత్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్, అభిమానులు , సినీ సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నాగ్ అశ్విన్ . ఈ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే నిర్మాత సీ.అశ్వినీ దత్ చిన్న కూతురు ప్రియాంక దత్ తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ప్రేమలో పడ్డ ఈ జంట పెద్దలను ఒప్పించి.. 2015లో సినీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక వీరి ప్రేమ, పెళ్లికి గుర్తుగా 2017లో కొడుకు పుట్టగా.. తన తొలి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు పెట్టిన రిషి అనే పేరును తన కొడుక్కి పెట్టి సినిమాపై ఉన్న మక్కువను చాటుకున్నారు నాగ్ అశ్విన్.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన ఆయన కెరియర్ ఆ తర్వాత 2018లో వచ్చిన మహానటి సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తర్వాత ప్రభాస్ హీరోగా కల్కి 2898ఏడీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2024 లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు.
also read:Kissik Talks: ఇండస్ట్రీ అమ్మాయిలకి పనికి రాదా? మేల్, ఫీమేల్ అవకాశాలపై రేఖ ఊహించని కామెంట్!
ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకుడి గానే కాకుండా నిర్మాతగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే జాతి రత్నాలు చిత్రాన్ని నిర్మించిన ఈయన.. రీసెంట్ గా వచ్చిన సింగ్ గీతం అనే చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు తను మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకొని స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.