Irumudi:గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ తొలిసారి రూట్ మార్చి డివోషనల్ టచ్ తో ‘ఇరుముడి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా జానర్ మార్చడమే కాకుండా మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ ఇరుముడి సినిమాలో రెండు అయ్యప్ప పాటలతో థియేటర్లలో జనాలకు పూనకాలు తెప్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా” కట్టు కట్టు ఇరుముడి కట్టు” అంటూ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపిస్తూ.. స్టెప్పులతో ఇరగదీసేశారు.
జాతీయ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఇరుముడి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు అయ్యప్ప పాటలు ఉండబోతున్నట్లు ఇప్పటికే జీవీ ప్రకాష్ స్పష్టం చేయగా అందులో ఒకటి తాజాగా విడుదల చేశారు. “స్వామియే శరణమం అయ్యప్ప.. మళ్లీ కట్టు శబరిమలెక్కి.. కళ్ళుం ముళ్ళుం కాలికిమెత్తి.. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. మండల దీక్ష ముగిసింది.. మాలకు అర్థం తెలిసింది.. శబరి కొండ పిలిచింది.. మణికంఠుడిని చేరగా పదమంది” అంటూ సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భక్తి పారవశ్యంతో ఊగేలా చేస్తోంది. ఈ సినిమాలో సరికొత్తగా అయ్యప్ప మాలలో కనిపించి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసేశారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఇరుముడి కట్టు నుండి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే ఇటీవల ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఒక వీడియోని పంచుకుంటూ.. ఇరుముడి సినిమాలో వచ్చే ఒక అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో మల్లెపూల పల్లకి అనే పాపులర్ భక్తి పాట కూడా ఉంటుంది. అలాగే ఇరుముడి కట్టు పాట కూడా ఈ చిత్రంలో యాడ్ చేయడం జరిగింది అంటూ తెలిపారు. మొత్తానికైతే అయ్యప్ప పడి పూజలో వినిపించే రెండు పాపులర్ భక్తి పాటలైన ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి పాటలతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి.
ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ , భూషణ్ కుమార్ టి సిరీస్ ఫిలిం సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా భక్తి , ఉత్కంఠభరితమైన ఎలిమెంట్స్ కలయికతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయ్యప్ప భక్తుల సెంటిమెంట్ , ఇరుముడి ప్రాముఖ్యత చుట్టూ తిరిగే ఒక బలమైన ఎమోషనల్ డివోషనల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతోంది.
also read:యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన ఏకైక తెలుగు హీరో!