E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

డైరెక్టర్ గా హీరో రామ్ కొత్త అడుగు.. ఘనంగా ‘RAPO23’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

డైరెక్టర్ గా హీరో రామ్ కొత్త అడుగు.. ఘనంగా ‘RAPO23’ పూజా కార్యక్రమాలతో  ప్రారంభం!
Advertisement

RAPO 23:స్రవంతి రవి కిషోర్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, చలాకీతనంతో చాక్లెట్ బాయ్ గా పేరు సంపాదించుకున్న రామ్ హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. ఇప్పుడు హీరో గానే కాకుండా దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.

దర్శకుడిగా రామ్ కొత్త మూవీ..

ఇకపోతే రామ్ దర్శకుడిగానే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ స్టోరీని కూడా స్వయంగా రామ్ రాసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. పైగా ఈ కొత్త ప్రాజెక్టును RAPO 23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు హైదరాబాదులో సాంప్రదాయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురి సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్టును రామ్ కు అందజేయగా.. సీనియర్ నటుడు మురళీమోహన్ ముహూర్తపు షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత పీవీ రవి కిషోర్ క్లాప్ కొట్టగా.. తొలి షాట్ కు స్వయంగా రామ్ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా ప్రారంభం కానుంది.

Advertisement

also read:రణబాలి నుండి స్పెషల్ వీడియో రిలీజ్.. విజయ్ ఎమోషనల్ పోస్ట్!

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్..

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇందులో రామ్ హీరోగా నటిస్తున్నారు. నియో నోయర్ బ్యాక్ డ్రాప్ లో సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు కనిపించని ఒక కొత్త అవతారంలో రామ్ కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమా రామ్ కెరియర్ లో ఒక భిన్నమైన చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ సినిమా నిర్మాణం విషయానికి వస్తే.. రాపో సినిమాటిక్ బ్యానర్ పై కృష్ణ పోతినేని తొలి నిర్మాణంలో నిర్మిస్తున్నారు. రామ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నిర్మాణ విలువలు, సాంకేతిక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందించనున్నట్లు సమాచారం.

సాంకేతిక బృందం..

Advertisement

ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ పీటర్ హైన్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు తీసుకోగా.. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ ను చూసుకుంటున్నారు. అలాగే నేషనల్ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. పైగా నివేతా పేరు ఇందులో హీరోయిన్ గా వినిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇక హీరోగా ఇన్ని రోజులు సక్సెస్ అయిన రామ్.. ఇప్పుడు దర్శకుడిగా తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

ఇండియాలో సునామీ సృష్టించిన చిన్న సినిమా… .ఏ ఓటీటీ లో తెలుసా ?

రణబాలి నుండి స్పెషల్ వీడియో రిలీజ్.. విజయ్ ఎమోషనల్ పోస్ట్!

బుల్లిరాజా మజాకా.. యంగ్ హీరోలను వెనక్కి నెట్టి మరీ అలాంటి రికార్డ్!

ఇరుముడి’ కట్టు సాంగ్ వచ్చేసింది.. ఇరగదీసేసిన మాస్ మహారాజా!

యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన ఏకైక తెలుగు హీరో!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే!

Salman Khan: భయం గుప్పెట్లో బ్రతుకు.. సొంత ఇంటిని వీడనున్న సల్మాన్ ఖాన్!

Big Stories

×