Bulli Raju:టాలెంట్ ఉండాలే కానీ వయసుతో, క్రేజ్ తో సంబంధం లేకుండా భారీ రెమ్యూనరేషన్ అందుకోవచ్చు అని నిరూపిస్తున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు అలియాస్ రేవంత్. చూడడానికి చిన్న వయసే కానీ మాటలు తూటాల పేలిపోతుంటే మెగాస్టార్ చిరంజీవి సైతం మురిసిపోయారు. అలాంటి ఈ బుడ్డోడి క్రేజ్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. అంతేకాదు యంగ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మరీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలాంటి రికార్డ్ సృష్టించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఈ చిన్నారి. ఇకపోతే తాజాగా ఇతని రెమ్యూనరేషన్ విషయాలు అందుకుంటున్న ప్రాజెక్టుల గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా సినిమాలకు చైల్డ్ ఆర్టిస్టులు పెద్ద అసెట్ అనే చెప్పాలి. ఇప్పటికీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టులను కథకు ప్రాణంగా పెట్టి భారీ సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలబడమే కాకుండా ఇందులో బుల్లి రాజు పాత్రకు అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భూతులు తిట్టడం అటు ఉంచితే అద్భుతమైన డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు బుల్లి రాజు. ఆ ఒక్క సినిమా ఈయనకు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
also read:ఇరుముడి’ కట్టు సాంగ్ వచ్చేసింది.. ఇరగదీసేసిన మాస్ మహారాజా!
ఈ సినిమా తరువాత ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ లో కూడా సందడి చేస్తున్నారు బుల్లి రాజు. ఇకపోతే ఈ బుల్లి రాజు ఈ ఏడాది మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ బుడ్డోడి అదృష్టం ఏమిటంటే.. మళ్లీ అనిల్ రావిపూడి తన సినిమాలో ఈయనకు అవకాశం కల్పించడం. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ -కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా బుల్లి రాజు కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే బుల్లిరాజుకి వరుసగా అవకాశాలు రావడమే కాకుండా ఆయన రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బుల్లిరాజు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ సినిమా సక్సెస్ లో భాగమవుతున్న నేపథ్యంలో తన క్రేజ్ ను బట్టి రోజుకు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.అంటే 30 రోజులు షూటింగ్ ఉంటే.. నెలకు ఈయన సంపాదన అక్షరాలా రూ.30 లక్షలు. ఇక ఈ రేంజ్ లో రోజూ వారీ పారితోషకం దక్కడం ట్రేడ్ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న హీరోలు కూడా ఇంత మొత్తంలో పారితోషికం తీసుకోవడం లేదని చెప్పాలి . అలా హీరోలను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ గా రికార్డ్ సృష్టించారు బుల్లి రాజు.