E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రణబాలి నుండి స్పెషల్ వీడియో రిలీజ్.. విజయ్ ఎమోషనల్ పోస్ట్!

రణబాలి నుండి స్పెషల్ వీడియో రిలీజ్.. విజయ్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Ranabali: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తన ఉనికిని చాటుకుంటూ.. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ (Rahul sankrityan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా తనను తాను నిరూపించుకొంటూనే.. తాజాగా ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో మళ్ళీ సినిమా చేస్తున్నారు. భారతీయ చారిత్రక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ‘రణబాలి’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో..

1870 సంవత్సరంలో సంభవించిన మహా కరువు కాలంలో రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు న్యాయకత్వం వహించిన ఒక పరాక్రమశాలి అయిన తిరుగుబాటు యోధుడి కథతో ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.

రాహుల్ బర్తడే.. రణబాలి నుండి మేకింగ్ వీడియో రిలీజ్..

Advertisement

మరొకవైపు ఈరోజు రాహుల్ పుట్టినరోజు కావడంతో మైత్రి మూవీ మేకర్స్ రాహుల్ కి ప్రత్యేకంగా స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినిమా నుండి మేకింగ్ వీడియోని పంచుకున్నారు. రాహుల్ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని ఒక వీడియో ద్వారా పంచుకుంటూ రాహుల్ కి స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేశారు.

రాహుల్ తో అనుబంధాన్ని పంచుకున్న విజయ్..

ఇకపోతే అటు విజయ్ దేవరకొండ కూడా రాహుల్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.. ” ప్రియమైన రాహుల్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. టాక్సీవాలా తర్వాత తొమ్మిది ఏళ్లకు మనం పెద్దవాళ్లమైనప్పటికీ అర్థవంతమైన కథలు రాయాలన్న నీ అలుపెరుగని అభిరుచిలోనూ.. వాటికి ప్రాణం పోయాలన్న నీ ప్రశాంతమైన తపనలోనూ.. నువ్వు ఏమీ మారలేదు. కేవలం రెండు సినిమాల్లోనే మనం ఎన్నో పోరాటాలు, అడ్డంకులను ఎదుర్కొని.. మన మొదటి సినిమాను అపారమైన ప్రేమ, విజయంతో ముందుకు నడిపించాము. నువ్వు చెప్పాలనుకునే ప్రతి కథకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ.. నిన్ను అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ విజయ్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. మొత్తానికైతే రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు, సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

also read:బుల్లిరాజా మజాకా.. యంగ్ హీరోలను వెనక్కి నెట్టి మరీ అలాంటి రికార్డ్!

కార్పొరేట్ ఉద్యోగం వదిలి సినిమా వైపు అడుగులు..

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన రాహుల్.. కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడై.. ఇన్ఫోసిస్ లో సిస్టం ఇంజనీర్ గా పనిచేశారు. ఖాళీ సమయంలో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ చివరికి మా టీవీ అవార్డును కూడా దక్కించుకున్నారు. సినిమాలపై ఉన్న వ్యామోహంతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అలా తొలిసారి 2014లో ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నప్పుడు తన సహా ఉద్యోగులతో కలిసి ‘ది ఎండ్’ అనే చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

రణబాలితో మళ్ళీ మన ముందుకు..

2018 లో విజయ్ దేవరకొండ హీరోగా సైన్స్ ఫిక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాక్సీవాలా సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కమర్షియల్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత నాని ద్విపాత్రాభినయంలో వచ్చిన పీరియడ్ డ్రామా శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దర్శకత్వం వహించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న ఈయన తాజాగా మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండ తో రణబాలి సినిమా చేస్తున్నారు.

Related News

బుల్లిరాజా మజాకా.. యంగ్ హీరోలను వెనక్కి నెట్టి మరీ అలాంటి రికార్డ్!

ఇరుముడి’ కట్టు సాంగ్ వచ్చేసింది.. ఇరగదీసేసిన మాస్ మహారాజా!

యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన ఏకైక తెలుగు హీరో!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే!

Salman Khan: భయం గుప్పెట్లో బ్రతుకు.. సొంత ఇంటిని వీడనున్న సల్మాన్ ఖాన్!

Nag Ashwin: శుభవార్త చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. జీవితంలో మరో కొత్త అధ్యాయం!

Bhagya Raj: మరణంలో కూడా ఆగని సాయం.. భాగ్యరాజ్ గొప్ప మనసుకు సినీలోకం ఫిదా!

Big Stories

×