Shivaji: ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు పండుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క హిట్.. జీవితాలనే మార్చేస్తుంది. నటుడు శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలను ప్రేక్షకులను అందించిన శివాజీ.. రాజకీయాల వలన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక అతని లైఫ్ బిగ్ బాస్ తో మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పెద్దన్నగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే #90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం.. అది భారీ విజయం అందుకోవడం.. శివాజీ కి బాగా కలిసొచ్చింది.
బిగ్ బాస్ తో 5 లో నిలిచి.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. ఇక బయటకు రాగానే శివాజీకి ఆఫర్ల వెల్లువ కురిసింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోర్ట్ సినిమా మరో ఎత్తు. మంగపతిగా శివాజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసింది. విలనిజంలో శివాజీ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా తరువాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం శివాజీ ఒకపక్క విలన్ గా.. ఇంకోపక్క హీరోగా చేతినిండా సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా దీపావళీ సందర్భంగా ఈ నటుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
శివాజీ, లయ జంటగా #90s సిరీస్ తో బాగా ఫేమస్ అయినా చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివాజీనే నిర్మించడం విశేషం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వేడుక సాంప్రదాయంగా పబ్ లో నిర్వహించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని శివాజీ చెప్పుకొచ్చాడు. శివాజీ, లయ ఇప్పటికే అదిరిందయ్యా చంద్రం సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై మంచి అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.