BigTV English

The Paradise: వెనక్కి తగ్గేదే లేదు..చరణ్ కు పోటీగా నాని..పోస్టర్ తో క్లారిటీ!

The Paradise: వెనక్కి తగ్గేదే లేదు..చరణ్ కు పోటీగా నాని..పోస్టర్ తో క్లారిటీ!
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో నాని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్లో దసరా సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి నాని శ్రీకాంత్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఏకంగా 8 భాషలలో విడుదల కానుంది.


8 భాషలలో ది ప్యారడైజ్..

ఈ సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాతలు చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ 8 భాషలలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా 2026 వేసవి సెలవలకు వాయిదా పడిందని అందుకే మార్చ్ 26వ తేదీ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాని(Peddi Movie) విడుదల చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు అనుగుణంగానే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వెనక్కి తగ్గేదే లేదు అంటున్న నాని..

పెద్ది సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకుందని త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక పాట కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. అలాగే ఈ సినిమాని మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో నాని సినిమా విడుదల వాయిదా పడిందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. చీకటిలో కూడా మరింత వెలుగును ఇస్తుంది అంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో ఈ సినిమా యధావిధిగా మార్చి26, 2026 న విడుదల కాబోతుందని తెలియజేశారు.


పాన్ ఇండియా స్థాయిలో విడుదల..

ఇలా ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, చిత్ర బృందం చెప్పకనే చెప్పేశారు.. దీంతో ఒకేసారి రామ్ చరణ్ నాని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున పోటీ పడబోతున్నాయని స్పష్టమవుతుంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రెండు సినిమాలలో హీరోలు కూడా విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది. మరి ఈ సినిమాలు విడుదల తేదీలలో ఎలాంటి మార్పులు లేకుండా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతారా?లేదంటే చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Bahubali The Epic: రీ రిలీజ్ లో కూడా ఈ రేంజ్ బిజినెస్ ఏందీ సామి.. ప్రభాస్ కే సాధ్యమా?

Related News

Mass Jathara : అర్థం పర్థం లేని పాటను రిలీజ్ చేసిన మాస్ జాతర యూనిట్

Actor Shivaji: సుధీర్ కి విలన్ గా శివాజీ.. మంగపతిని మించిన పాత్ర ఇది, ఇక వెండితెరపై రచ్చే

Renu Desai: సన్యాసిగా రేణూ దేశాయ్.. కఠిన నిర్ణయం వెనుక కారణం?

Allu Shirish: కాబోయే భార్యతో అల్లు శిరీష్ దీపావళి సెలబ్రేషన్స్…ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘.. దీపావలి పోస్టర్ చూశారా?

Eesha Rebba: ఆ డైరెక్టర్ ప్రేమలో ఈషా రెబ్బ.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చారుగా!

SIR Movie: ఏంటీ.. సార్ మూవీ ఫస్ట్ ఛాయిస్ ధనుష్ కాదా.. డైరెక్టర్ క్లారిటీ!

Big Stories

×