Sankranti 2026: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న హీరోలు మొదలుకొని స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని చాలా సినిమాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి రేసులోకి తాజాగా మరో మూవీ కూడా వచ్చి చేరింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటికే ఈ సంక్రాంతి రేసులో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో పాటు ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి ఇలా చాలామంది హీరోలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి యంగ్ హీరో శర్వానంద్ కూడా వచ్చి చేరబోతున్నారు. విషయంలోకి వెళ్తే ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నారు శర్వానంద్. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ , ఫ్యామిలీ, కామెడీ, ఎమోషన్స్ అన్ని కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు దీపావళి స్పెషల్ గా అనౌన్స్ చేశారు.. అందులో భాగంగానే ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా పంచుకోవడం జరిగింది.
ఈ పోస్టర్ లో సాంప్రదాయంగా పంచే కట్టులో శర్వానంద్ చాలా కొత్తగా కనిపించారు. కేరళ స్టైల్ ఆచారాలు.. వెనుక డాన్సర్లతో పువ్వులపై నడుస్తూ వస్తున్న శర్వానంద్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ పోస్టర్ సరికొత్త పండగ వాతావరణం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు భారీ హైప్ క్రియేట్ చేశాయి. పైగా ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో రామబ్రహ్మం సుంకర నిర్మించగా..చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సంక్రాంతి రేస్ లో నిలిచిన చిత్రాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ రాబోతోంది. ఈ సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్ ‘ కూడా సంక్రాంతి రేసులో విడుదల కాబోతోంది. జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అలాగే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ మూవీతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. అలాగే మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న #RT 76 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి రాబోతోంది. అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా ఇదే సంక్రాంతికి తన సినిమా జన నాయగన్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తానికైతే ఇటు యంగ్ హీరోలు అటు స్టార్ సీనియర్ హీరోలు వచ్చే సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. మరి ఇంత టఫ్ ఫైట్ జరగబోతున్న నేపథ్యంలో ఎవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి.
also read: Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?
Sharwanand nari nari naduma Murari movie also release on Sankranti 2026(image source:instagram)