BigTV English

Viral News: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Viral News: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!
Advertisement

Jabalpur Railway Station Viral Video:

డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఎవరి పర్సులో డబ్బులు ఉండటం లేదు. చాక్లెట్ కొనుగోలు చేసినా, ఫోన్ పే, లేదంటే గూగుల్ పే చేస్తున్నారు. కొన్నిసార్లు పేమెంట్స్ సక్సెస్ కాక చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఓ రైల్వే ప్రయాణీకుడికి అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. రైల్వే స్టేషన్ లో స్నాక్స్ తీసుకున్నాడు. యుపిఐ ద్వారా డబ్బులు పే చేస్తే ఫెయిల్ అని వచ్చింది. ఓ వైపు రైలు కదులుతుంది. మరోవైపు స్నాక్స్ అమ్మేవ్యక్తి డబ్బులు ఇవ్వాలంటూ కాలర్ పట్టుకుని బెదిరించాడు. చేసేదేమీ లేక తన చేతికి ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఇచ్చి వెళ్లి రైలు ఎక్కాడు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అక్టోబర్ 17న మధ్య ప్రదేశ్ లోని ఓ వ్యక్తి రైలు ప్రయాణం చేస్తున్నాడు. జబల్పూర్ స్టేషన్ కు చేరుకోగానే అతడు దిగి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. సుమారు రూ. 180 విలువ చేసే స్నాక్స్, ఇతర తినుబండారాలు తీసుకున్నాడు. యుపిఐ పేమెంట్ చేశాడు. కానీ, అది ఫెయిల్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో రైలు కూడా కదులుతుంది. ఈ సమయంలో సమోసా విక్రేత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో అడుగు ముందుకు వేసి కాలర్ పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే దౌర్జన్యం చేశాడు. సదరు ప్రయాణీకుడు చేసేదేమీ లేక, ఎక్కడ రైలు మిస్ అవుతానేమోనని తన చేతికి ఉన్న స్మార్ట్  వాచ్ ను తీసి ఇచ్చి.. పరిగెత్తుకెళ్లి రైలు ఎక్కాడు.

విక్రేతపై కేసు నమోదు చేసిన పోలీసులు 

ఓ ప్రయాణీకుడు ఈ గొడవను తన సెల్ ఫోన్ లో షూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు సీరియస్ అయ్యారు.విక్రేతపై రైల్వే చట్టంలోని సెక్షన్ 145 కింద కేసు నమోదు చేశారు.  “సమోసా విక్రేత, ప్రయాణీకుడి పట్ల వ్యవహరించిన తీరు నిజంగా దారుణం. డబ్బులు ఉన్నప్పటికీ, తను పే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అతడి ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం నిజంగా దారుణం. ఇలాంటి ప్రవర్తన మళ్లీ రిపీట్ కాకూడదని హెచ్చరించాం” అని పోలీసులు తెలిపారు.


నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అటు  ఈఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నలుగురిలో ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని వేధించడం నిజంగా సమర్థించే సంఘటన కాదంటున్నారు. మర్యాదస్తుడైన సదరు ప్రయాణీకుడు ఈ ఘటనతో షాకయ్యాడు. అందుకే, తన చేతికి ఉన్న విలువైన స్మార్ట్ వాచ్ ను ఇచ్చేసి వెళ్లాడు. నిజానికి రూ. 180 కోసం అంతగా వేధించాల్సిన అవసరం లేద” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “డబ్బులు చెల్లించి ఉండకపోతే, తన స్నాక్స్ తాను తీసుకుంటే సరిపోయేది. ఇంత రభస చేయాల్సిన అవసరం లేదు” అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: తప్పుడు వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, రైల్వే సీరియస్ వార్నింగ్!

Related News

Little Girls Dance: మెట్రో రైల్లో చిన్నారుల డ్యాన్స్, చూస్తే ఫిదా కావాల్సిందే!

Horrific Video: పక్కనే కూర్చొని మైనర్ బాలికను.. ఛీ, ఎద్దులా పెరిగావ్ బుద్ధిలేదా?

Shocking Video: రైళ్లలో ఫుడ్ ఇలాంటి కంటేనర్లలో ప్యాక్ చేస్తారా? చూస్తే వాంతి చేసుకోవడం పక్కా!

Special Train: విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు, పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం!

Indian Railways: తప్పుడు వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, రైల్వే సీరియస్ వార్నింగ్!

Airline Apology: జ్వరంతో చనిపోయిన ఎయిర్ హోస్టెస్.. లీవ్ లెటర్ అడిగిన విమాన సంస్థ.. నెటిజన్లు ఆగ్రహం!

Train Tickets: గుడ్ న్యూస్, ఇక పోస్టాఫీసులోనూ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!

Big Stories

×