Nara Rohith : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సోలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈయన ఆ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ ఏ ఒక్క సినిమా కూడా అతనికి పెద్దగా స్టార్ డం ని తీసుకురాలేదు. దాంతో ఈమధ్య సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా సుందరకాండ సినిమాలో నటించాడు.ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ హీరో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
నారా రోహిత్, శిరీష పెళ్లి జరగబోతుంది. మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ పెళ్లికి సంబంధించినా పనులు మొదలయ్యాయి. అయితే ఈ పెళ్లికి నారా రోహిత్ ఎన్టీఆర్ ని పిలుస్తాడా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. నారా రోహిత్ పెళ్లిని నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే ఈ పెళ్లికి ఎన్టీఆర్ ని పిలుస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లికి బాలకృష్ణ రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. సొంత బావ, వియ్యంకుడు అయినా చంద్రబాబు నాయుడు ఇంట పెళ్లి జరుగుతుంటే బాలయ్య రాకుండా ఎలా ఉంటాడు. అయితే ఎన్టీఆర్ ను పిలిస్తే బాలయ్య పెళ్లికి వస్తాడా..? బాలయ్య వస్తుంటే ఎన్టీఆర్ ఎలా వస్తాడు.. అసలే బాబాయ్ అబ్బాయిల మధ్య మాటలు లేవు కాబట్టి.. వీళ్ళిద్దరూ ఒకచోట ఎదురుపడే అవకాశం ఉండదు అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరి నారా రోహిత్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపాడా? లేదా? అన్న దానిపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.. అయితే ఆయనకు సంబంధించిన రాజకీయ నేతలు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు. అటు సినీ ఇండస్ట్రీ నుంచి కిరణ్ అబ్బవరం, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లతో పాటు ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ లతో పాటుగా నారా రోహిత్ తో పాటుగా నటించిన స్టార్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Also Read :డైరెక్టర్ టు హీరో జర్నీ.. ప్రదీప్ రంగనాథన్ సంపాదించిన ఆస్తులు ఇవే..?
ప్రతినిధి 2 మూవీ టైంలో హీరోయిన్ శిరీషతో రోహిత్ ప్రేమలో పడ్డారు.. వీరిద్దరి ప్రేమని పెద్దల వరకు తీసుకెళ్లారు. గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబల మధ్య జరిగింది. సరిగ్గా మళ్లీ ఏడాదికి పెళ్లి జరగబోతుంది.. ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే.. బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, స్వామీ రారా, ప్రతినిధి లతో పాటుగా 25 సినిమాలు చేశాడు. 2018లో వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నారు. ప్రతినిధి 2తోనే రీ ఎంట్రీ ఇచ్చారు.. రీసెంట్‌గా భైరవం, సుందరకాండ సినిమాల్లో నటించి మెప్పించారు నారా రోహిత్. ఈ మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి..