Buchi babu Confirms Peddi Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా కాంబినేషనల్ తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది‘. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మల్టీఫుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్ కోచ్ గా కనిపించబోతున్నాడు. ప్రకటనతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో చరణ్ షాట్ ఓ రెంజ్ ఎలివేట్ క్రియేట్ చేసింది. గ్లింప్స్ చూపించిన పెద్ది షాట్ ఏకంగా క్రికెటర్స్ సైతం ఆకట్టుకుంది.
ఐపీఎల్ ఫ్రాంఛైజ్ రాజస్తాన్ రాయల్స్ పెద్ది షాట్ ఉపయోగించడంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం నుంచి వస్తున్న ఒక్కొక్కొ అప్డేట్ ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా పెద్ది మూవీ రిలీజ్ పాటు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇటీవల ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చిబాబు అక్కడ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పెద్ది మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే పెద్ది నుంచి ఓ సూపర్ లవ్ సాంగ్ వస్తుందని చెప్పాడు.
’మరో 15, 20 రోజుల్లో పెద్ది నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రాబోతోంది. ఏఆర్ రెహమాన్ ఇచ్చారు. ఈ పాట నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది శ్రీరామ నవమికి మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఆ స్పెషల్ డే రోజున మూవీ రిలీజ్ చేసేందుకు మా టీం అంత చాలా కష్టపడుతున్నాం. అన్ని ఓకే అయితే శ్రీరామ నవమికి విడుదల చేస్తాం. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా దీనిపై ప్రకటన ఉండోచ్చు’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఈ అప్డేట్ చూసి మెగా ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. కాగా మార్చి 26న పెద్ది విడుదల ఉంటుందని ఇప్పటికే మూవీ టీం చెప్పకనే చెప్పింది. చరణ్ పుట్టిన రోజుకి దీనిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని తాజాగా డైరెక్టర్ హింట్ ఇచ్చేశారు.
పెద్ది కోసం నెలలు వెయిట్ చేయాల్సిన పని లేదని, బుచ్చిబాబు సినిమా షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాన్నారంటూ మురిసిపోతున్నారు. ఇక త్వరలో వచ్చే లవ్ సాంగ్ కోసం వెయింటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న) కీలక పాత్రలో నటిస్తుండగా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది.