Sharwanand 36 Title Announced: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం తన 36వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ప్రకటించింది ఏడాది దాటింది. కానీ, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. శర్వా కూడా బయట పెద్దగా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? షూటింగ్ జరుగుతుందా? అనే సందేహాలు వచ్చాయి. అయితే సైలెంట్ గా చకచక షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం.
ఇవాళ మూవీ టైటిల్ ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు మేకర్స్. అన్నట్టుగానే తాజాగా మూవీ టైటిల్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘బైకర్‘ టైటిల్ ఫిక్స్ చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ఆకట్టుకుంటుందో. ఇది వరకు ఎన్నడు చూడని శర్వాని చూడబోతున్నారని అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్స్ శర్వానంద్.. బైకర్ లో స్పోర్ట్స్ పర్సన్ గా ఇంటెన్సీ లుక్ లో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ బైక్ పై కూర్చోని రేస్ గా సిద్ధంగా ఉన్న చిరుతలా కనిపించాడు.
ప్రస్తుతం ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మూవీపై మరింత బజ్ పెరిగింది. గ్యాప్ తీసుకున్నదీపావళికి ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారంటున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనుందట మూవీ టీం. కాగా మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్ సమర్ఫణలో వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతోంది. ఇందులో శర్వా బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు.
కాగా యూవీ క్రియేషన్స్ శర్వాకి లక్కీ బ్యానర్ అని చెప్పాలి. గతంలో ఈ బ్యానర్ లో తెరకెక్కిన రన్ రాజా రన్, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. శర్వానంద్, యూవీ క్రియేషన్స్ కలయిలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. దీంతో నాలుగో సినిమా వస్తున్న బైకర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సారి శర్వా స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. మరోవైపు శర్వానంద్ సినిమా లైనప్ చూస్తుంటే మామూలుగా లేదు. దీనితో పాటు తన 37వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇందులో శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁
Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovie
Charming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL
— UV Creations (@UV_Creations) October 20, 2025