Bahubali The Epic: ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ విషయంలో కూడా రాజమౌళి(Rajamouli) మరొక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి(Bahubali). ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు భాగాలను కలిపి రాజమౌళి ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇలా రెండు భాగాలు కలిసి ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని తెలియచేయడంతో సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా విడుదలకు రాజమౌళి అన్ని సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు పెద్దగా బిజినెస్ జరగదని చెప్పాలి కానీ ప్రభాస్ సినిమా రీ రిలీజ్ అవ్వబోతోంది అంటే మీడియం రేంజ్ హీరోల సినిమాలకు బిజినెస్ జరిగిన విధంగానే జరిగిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
మరి బాహుబలి సినిమా రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.17 కోట్లు బిజినెస్ జరుపుకోగా ఆంధ్రాలో రూ.15 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే..రూ. 4.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఏకంగా రూ.36.5 కోట్ల బిజినెస్ జరుపుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఈ స్థాయిలో బిజినెస్ విజయ్ దేవరకొండ నాని లాంటి హీరోలు నటించిన సినిమాలు విడుదలయ్యే సమయంలో ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రీ రిలీజ్ కూడా అదే రేంజ్ లో బిజినెస్ జరుపుకోవడంతో అభిమానులు ఎలాంటి రికార్డులు సృష్టించాలన్న అది ప్రభాస్ కి మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A 16+సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా 3:45 నిమిషాల రన్ టైం లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించి మరికొన్ని కొత్త సన్నివేశాలను కూడా జోడించినట్టు చిత్ర బృందం వెల్లడించారు.