E-Paper
Advertisement

IND VS NZ Final: వాస్తు పిచ్చి, న్యూజిలాండ్ ఓడిపోయేలా BCCI కుట్ర‌లు…టీమిండియా కోసం స్పెష‌ల్ హోట‌ల్, డ్రెస్సింగ్ రూమ్స్‌

IND VS NZ Final: వాస్తు పిచ్చి, న్యూజిలాండ్ ఓడిపోయేలా BCCI కుట్ర‌లు…టీమిండియా కోసం స్పెష‌ల్ హోట‌ల్, డ్రెస్సింగ్ రూమ్స్‌

IND VS NZ Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ( Team India vs New Zealand, Final )తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad ) ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కొత్త స్కెచ్ లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2023 సమయంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరిగిన తప్పిదాలను ఈసారి జరగకుండా, అన్ని ప్రణాళికలు బీసీసీఐ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

 

టీమిండియా కు స్పెషల్ గా హోటల్.. న్యూజిలాండ్ కు మాత్రం !

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జట్టు కోసం ప్రత్యేకంగా కొత్త హోటల్ ను బుక్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐసీసీ ముందుగా చెప్పినట్లుగా ఐటీసీ నర్మదాలో కాకుండా టీమిండియా కోసం తాజ్ స్కై లైన్ బుక్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఐటిసి నర్మదా హోటల్ లోనే రోహిత్ శర్మ సేన బస చేసింది. అయితే అప్పుడు టీమిండియా అత్యంత దారుణంగా ఫైనల్స్ లో ఓడిపోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా చాంపియన్ అయింది. అయితే అలాంటి తప్పిదం ఈసారి జరగకూడదని, న్యూజిలాండ్ ప్లేయర్లను ఐటిసి నర్మదా హోటల్ కు బీసీసీఐ ప్లాన్ ప్రకారం పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా జట్టు కోసం తాజ్ స్కై లైన్ బుక్ చేసింది బీసీసీఐ. అలాగే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్స్‌ న్యూజిలాండ్ కు ఇచ్చారని తెలుస్తోంది.

డ్రెస్సులు రూమ్స్ కూడా మార్చారు

టీమిండియా ప్లేయర్లకు మాత్రం విసిటింగ్ టీమ్ గదిని డ్రెస్సింగ్ రూమ్ గా మార్చారని తెలుస్తోంది. ఓ వాస్తు పండితుడు చెప్పినట్లుగా బీసీసీఐ ఇలా చేసినట్లు సమాచారం. అంటే 2023లో టీమిండియాకు బ్యాడ్ లక్ ఉన్న వాటిని మొత్తం న్యూజిలాండ్ కు బీసీసీఐ కేటాయించినట్లు చెబుతున్నారు. ఎలాగైనా టీమిండియా వరల్డ్ కప్ గెలిచేలా ఈ స్కెచ్ లు వేశారని వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఇంతలా స్కెచ్ లు వేసినప్పటికీ, టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ప్రదర్శన చేస్తేనే టైటిల్ వస్తుందని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం వాస్తులో మార్పులు చేస్తే కచ్చితంగా టీమిండియా కు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

?igsh=Nndzb3F5Y2M0OGEx

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×