E-Paper
Advertisement

The Raja Saab: హిప్నాటిక్ థ్రిల్లర్.. జియో హాట్‌స్టార్ అస్సలు తగ్గట్లేదుగా!

The Raja Saab: హిప్నాటిక్ థ్రిల్లర్.. జియో హాట్‌స్టార్ అస్సలు తగ్గట్లేదుగా!
Advertisement

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రం వెండితెరపై అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే విషయం తెలిసిందే. భారీ పోటీ నడుమ రావడంతో పాటు, సినిమాలోని కంటెంట్‌ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ప్రభాస్ కంటే ఆయన డూపే ఎక్కువ సీన్లు చేశాడనేలా కూడా టాక్ నడిచింది. ఇక బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డిజిటల్ దునియాను మాత్రం షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం, అనూహ్యమైన వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతోంది. థియేటర్లలో హర్రర్-కామెడీగా సందడి చేసిన ఈ సినిమాను, ఇప్పుడు ఓటీటీలో ‘హిప్నాటిక్ థ్రిల్లర్’ (Hypnotic Thriller)గా సరికొత్తగా జియో హాట్‌స్టార్ ప్రమోట్ చేస్తుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.

Also Read- Seetha Payanam: భూమిలో పుట్టింది.. శ్రీరాముల వారికి ప్రియమైనది.. ఇంట్రస్టింగ్‌గా ట్రైలర్!

హిస్టారిక్ రష్.. సర్వర్లు అప్‌గ్రేడ్

Advertisement

థియేటర్లలో విడుదలైనప్పుడు వచ్చిన టాక్‌తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. అందుకే, ఓటీటీలో ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారు. అందులోనూ ఫ్రెష్ కంటెంట్ కొంత యాడ్ చేశామని చెప్పడంతో హిస్టారిక్ రష్ ఏర్పడిందని, అందుకే సర్వర్లు కూడా అప్‌గ్రేడ్ చేశామని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. స్ట్రీమింగ్ ప్రారంభానికి ముందే జియో హాట్‌స్టార్‌లోని ‘రిమైండ్ మీ’ బటన్‌పై రికార్డు స్థాయిలో క్లిక్స్ వచ్చాయని, ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో, ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి వచ్చిందని స్వయంగా ఓటీటీ సంస్థ ప్రకటించడంతో.. ప్రభాస్ స్టామినా ఇది అంటూ ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేశారు. ప్రభాస్ క్రేజ్ ఇదంటూ వారు ప్రశంసలు కురిపించడం మొదలెట్టారు.

Also Read- Sampradayini Suppini Suddapoosani: మరో ‘దృశ్యం’.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ ఎలా ఉందంటే?

కారణం..ఎక్స్‌టెండెడ్ కట్

Advertisement

వాస్తవానికి ఈ సినిమా నార్మల్‌గా విడుదలై ఉంటే అంత ట్రాఫిక్ ఉండేది కాదేమో.. ఈ డిజిటల్ రిలీజ్‌లో ఉన్న అతిపెద్ద సర్ప్రైజ్ ఎక్స్‌టెండెడ్ కట్ అనే చెప్పాలి. థియేట్రికల్ వెర్షన్‌లో సాంకేతిక కారణాల వల్ల మిస్ అయిన కొన్ని కీలక సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చేర్చారు. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓల్డ్ గెటప్ సీన్స్, ఇంకా సుమారు 4 నిమిషాల నిడివి గల అదనపు ఫుటేజ్ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. ఈ సీన్స్ సినిమా కథలోని సస్పెన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రంలో హిప్నాటిజం, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు ఓటీటీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా విడుదలైన ట్రైలర్‌లో సినిమాను ఒక సీరియస్ థ్రిల్లర్‌గా ప్రెజెంట్ చేయడం వల్ల, గతంలో సినిమా చూసిన వారు కూడా మళ్ళీ స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్రపంచంలో కాస్త వెనుకబడిన జియో హాట్‌స్టార్‌కు ‘ది రాజా సాబ్’ మాంచి బూస్ట్ ఇవ్వడంతో.. ప్రమోషన్స్‌లో అసలెక్కడా తగ్గడం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్‌ను జియో హాట్‌స్టార్ వదులుతూనే ఉంది. మరి ఈ హంగామా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Also Read- Funky Trailer: అనుదీప్ స్టైల్లో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి నవ్వుల వర్షం ఖాయం..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×