Annavaram: అన్నవరం వెళ్తున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీరు ఇబ్బందులు పడక తప్పదు. పూర్తి వివరాలు తెలుసుకుని వెలితే అక్కడ స్వామి వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడమే కాకుండా అంతకన్నా ఎక్కువ ప్రశాంతంగా స్వామి వారి వ్రతం చేయించుకుని రావోచ్చు. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి రోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. అయితే స్వామి దర్శనానికి వెళ్లిన భక్తుల్లో 90శాతం మంది కచ్చితంగా స్వామి వారి వ్రతం చేయించుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ వివరాలు. వ్రతం చేయించుకోవాలి అనుకునే వారు ముందుగా ఈ వివరాలు తెలుసుకుని వెళ్లడం వల్ల ప్రశాంతంగా స్వామి వ్రతం చేయించుకుని రావొచ్చు.
అన్నవరం వెళ్లి ఆ సత్య దేవుని వ్రతం చేయించుకుందామనుకునేవారు వ్రతానికి సంబంధించిన సామాన్లు మీ ఇంటి దగ్గర నుండి మీరే తీసుకుని వెళ్లడం బెటర్ అంటున్నారు భక్తులు. ఎందుకంటే అక్కడ వ్రతంలో లో ఇచ్చే తమలపాకులు, మారేడు పత్రి, తులసీదళం, కర్పూరం బిల్లలు అగర్బత్తి పుల్లలు నామమాత్రంగానే ఉంటాయట. అందువల్ల మీరు తప్పనిసరిగా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లడమే బెటర్ అంటున్నారు. అయితే ఏయే సామాన్లు తీసుకెళ్లాలో వివరంగా ఇక్కడ తెలుసుకోండి.
ఆరు కొబ్బరికాయలు (ఐదు కొబ్బరికాయలు వ్రతానికి ఒక కొబ్బరి కాయ దర్శనానికి), రెండు డజన్లు తమలపాకులు (24 ఆకులు), ఒక డజను లేదా అరడజను అరటిపళ్ళు, విడిగా పువ్వులు, కొన్ని మారేడు ఆకులు, కొన్ని తులసి ఆకులు, ఆరు అగరబత్తి పుల్లలు, రెండు ఒత్తులు (దీపం వెలిగించడానికి), రెండు కర్పూరం బిళ్ళలు, పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా, మీరు తయారు చేసుకున్న అక్షింతలు, అగ్గిపెట్టె మరి ముఖ్యంగా ఉండవలసింది అగ్గిపెట్టే దీనితోటే మొదట వ్రత పూజ ప్రారంభమవుతుంది. అక్కడ పూజలో కూర్చున్న తర్వాత ఎవరెవరినో అడగకుండా మీరే ఒకరికి ఇవ్వొచ్చు. 5 రూపాయలు లేదా 10 రూపాయలు లేదా 20 రూపాయలు లేదా 50 రూపాయలు చిల్లర కొంత మొత్తం మీ దగ్గర పెట్టుకుంటే చాలా చోట్ల బాగా ఉపయోగపడుతుంది.
ఇవన్నీ తీసుకుని వ్రతం చేయించుకోవడానికి వెళితే లోపల వ్రతంలో కంగారు లేకుండా మనఃస్పూర్తిగా స్వామి వారి వ్రతం జరిపించుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా స్వామి వారి వ్రతం చేయించుకుంటారో అంతే ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి వెళ్లి రావచ్చు. స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక.. అక్కడే ఆలయంలో కొద్ది సేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇక భోజనాలకు కూడా అన్నవరంలో లోటు ఉండదు. ఇంకా చెప్పాలంటే తిరుమల కంటే ముందుగా అన్నదానం ప్రారంభించింది అన్నవరంలోనేనట. అందుకని ఆలయంలో నుంచి బయటకు రాగానే కుడివైపు అన్నసత్రం ఉంటుంది. అక్కడికి వెళ్లి అక్కడ భోజనం చేయండి. భోజనం చాలా బాగుంటుందని.. ఇంటి వంటకు మించి ఉంటుందని చాలా భక్తులు చెప్తుంటారు. తర్వాత ప్రశాంతంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకుని తిరుగు ప్రయాణం చేయవచ్చు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.