E-Paper
Advertisement

Highway Robbery: హైవేపై భారీ దోపిడి.. రన్నింగ్ ట్రక్ నుంచి.. ఫ్లిప్‌కార్ట్ ఫోన్లు దోచేశారు!

Highway Robbery: హైవేపై భారీ దోపిడి.. రన్నింగ్ ట్రక్ నుంచి.. ఫ్లిప్‌కార్ట్ ఫోన్లు దోచేశారు!
Advertisement

Highway Robbery: కర్ణాటకలోని హవేరి జిల్లాలో సినీ ఫక్కీలో దారి దోపిడి జరిగింది. కదులుతున్న ట్రక్ నుంచి రూ.25 లక్షల విలువైన మెుబైల్స్ ను దొంగలు దోచేశారు. చోరికి గురైన మెుబైల్స్ అన్నీ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్టుకు చెందినవిగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే..

హవేరి జిల్లాలోని 48వ జాతీయ రహదారి(NH-48)ఈ భారీ చోరి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి ధార్వాడ్ జిల్లా (Dharwad district)లోని కోటూరు గ్రామం (Kotur village)లో ఉన్న ఫ్లిప్ కార్ట్ గిడ్డంగి (Flipkart Warehouse)కి మెుబైల్స్ తరలిస్తుండగా ఈ దొంగతనం జరిగింది. నిందితులు లింక్డ్ లాకింగ్ పరికరం ( linked locking device)ను ట్యాంపర్ చేసి పగలగొట్టారు. అనంతరం మెుబైల్స్ తో ఉన్న 6 పెద్ద పెట్టెలను దోచేశారు. ఆ బాక్సుల్లోని మెుబైల్స్ విలువ దాదాపు రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి 1 గంటకు చోరి..

Advertisement

రాణేబెన్నూర్ తాలూకాలోని కాకోల్ – మోటేబెన్నూర్ మార్గాల మధ్య లారీ ప్రయాణిస్తున్న క్రమంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రహదారుల వెంట దారిదోపిడికి తెగబడే ముఠాలు ఈ చోరికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైవేలపై దారిదోపిడి ఘటనలు పెరిగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దారి దోపిడిలో బాగా అనుభవం ఉన్న క్రిమినల్స్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read: IND VS USA: ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే..300 కొట్ట‌డం ప‌క్కా, బుమ్రా, సంజు దూరం

ప్రత్యక బృందాలతో దర్యాప్తు

Advertisement

హైవేపై లారీని దోచేసిన ఘటనపై రాణేబెన్నూరు గ్రామీణ పోలీసులు (Ranebennur Rural Police Station) కేసు నమోదు చేశారు. అనుమానితుల కదలికలను తెలుసుకునేందుకు NH-48 ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. చోరికి పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని.. నిందితుల అరెస్టుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

Also Read: Arjuna – Tirumala: తిరుమలలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఎక్కడో తెలుసా..? అత్యంత పవిత్ర తీర్థాలలో అది ఒకటి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×