Indian Railways: IRCTC స్మార్ట్ ఫీచర్లను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే రైలులో ప్రయాణించేటప్పుడు కన్పార్మ్ టికెట్ పొందడం అంత కష్టమైన పనేమీ కాదు. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రత్యామ్నాయ రైళ్ల ఎంపికను ఎంచుకోవడం వల్ల.. అదే రోజు నడుస్తున్న ఇతర రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆటో అప్ గ్రేడ్ ఫీచర్ ను ఆన్ చేయడం ద్వారా, అవసరమైతే మీరు అదనపు ఛార్జీ చెల్లించకుండా పై క్లాస్ లో సీటును పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేయడంలో సహాయపడతాయి.
నిజానికి రైలు ప్రయాణికులు కన్ఫార్మ్ టికెట్ పొందడం చాలా కష్టమైన పనిగా భావిస్తారు. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, వీకెంట్స్ లో కన్ఫార్మ్ టికెట్లు పొందడం మరీ కష్టం. చాలా మంది ప్రయాణీకులు వెయిటింగ్ లిస్ట్ లో లేదంటే RAC టికెట్లో రాజీ పడాల్సి ఉంటుంది. కానీ, IRCTC వెబ్ సైట్, యాప్ లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ధృవీకరించబడిన టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
ఆల్టర్నేట్ రైళ్లు, ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి!
IRCTC నుంచి టికెట్లను బుక్ చేస్తున్నప్పుడు, కచ్చితంగా ప్రత్యామ్నాయ రైళ్ల ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ఒకే రైలుపై ఆధారపడకుండా, అదే రోజు ఇతర రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్లను చూపుతుంది. మరోవైపు, ఆటో అప్ గ్రేడ్ ఫీచర్ ను ఆన్ చేయడం ద్వారా, పై క్లాస్ లో ఖాళీ సీటు ఉంటే అదనపు ఛార్జీ లేకుండా అప్‌గ్రేడ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
సమీప స్టేషన్లను ఎంచుకోండి!
ఒకవేళ పెద్ద, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కే పరిస్థితి ఉంటే, తక్కువ రద్దీ ఉండే సమీప స్టేషన్ ఎంపికను ఎంచుకోండి. ఇది సమీపంలోని స్టేషన్ నుండి టికెట్ పొందే అవకాశాలను పెంచుతుంది. మీరు అక్కడి నుండి రైలును ఎక్కవచ్చు.
Read Also: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి రాయితీ దొరుకుతుంది!
తత్కాల్ బుకింగ్ కోసం ప్రయత్నించండి!
సాధారణ బుకింగ్ లో టికెట్లు అందుబాటులో లేనప్పుడు, తత్కాల్ బుకింగ్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. కానీ, తత్కాల్ టికెట్ ను వేగంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకుల వివరాలు, చెల్లింపు పద్ధతిని IRCTC ఖాతాలో ముందుగానే సేవ్ చేసుకోవాలి. ఉదయం 10 గంటలకు ముందు లాగిన్ అవ్వండి. తద్వారా భారీ ట్రాఫిక్ సమయంలో కూడా మీకు లాగిన్ సమస్య ఉండదు. IRCTC ఈ సులభమైన ఉపాయాలు, స్మార్ట్ ఫీచర్ల సహాయంతో, ధృవీకరించబడిన సీటు పొందే అవకాశాలను చాలా వరకు పెంచుకోవచ్చు. ప్రయాణానికి ముందు కొంచెం అవగాహన మిమ్మల్ని టికెట్ల కోసం వేచి ఉండే ఇబ్బంది నుండి కాపాడుతుంది. మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చా? ఇదీ అసలు విషయం!