Anshu Reddy -sree priya: బుల్లితెర నటీమణులుగా పెద్ద మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అన్షు రెడ్డి(Anshu Reddy), శ్రీ ప్రియ(Sree Priya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ వరుస బుల్లితెర సీరియల్స్ నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయటమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అన్షు రెడ్డి, శ్రీ ప్రియ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి తరచూ వెకేషన్ లకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.
పెళ్లికి సిద్ధమైన అన్షు రెడ్డి.. శ్రీ ప్రియ…
ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ శివ(Anchor Siva) ఇద్దరిని పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు. మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించడంతో… మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవడమా? లేదంటే విడివిడిగా పెళ్లి చేసుకోవడమా? అంటూ తిరిగి ప్రశ్న ఎదురయింది. అదే మీ ఇద్దరు కలిసి అబ్బాయిలతో ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారనే ప్రశ్న వేశారు. మాకు సరైన అబ్బాయి దొరికితే వెంటనే మా పెళ్లి జరుగుతుందని ఈ సందర్భంగా అన్షు రెడ్డి, శ్రీ ప్రియ వెల్లడించారు.
ఇంటర్వ్యూకి పిలిచావా? ప్రపోజ్ చేయడానికి పిలిచావా?
ఇకపోతే తమకు కాబోయే భర్త ఎలా ఉండాలి అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాలు గురించి కూడా తెలిపారు. మంచి అబ్బాయి అయ్యి మమ్మల్ని అర్థం చేసుకోవాలని, మేము ఉన్న ఈ ప్రొఫెషన్ ను అర్థం చేసుకొని మాకు ప్రోత్సహించే అబ్బాయి అయితే చాలు అంటూ ఈ సందర్భంగా తమకు కాబోయే భర్తలు ఎలా ఉండాలో ఈ ఇద్దరు తెలియచేశారు. ఈ క్వాలిటీస్ అని నాలో ఉన్నాయి అంటూ శివ చెప్పడంతో… నువ్వు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేకి పిలిచావా ? లేదంటే ప్రపోజ్ చేసేకి పిలిచావా? అంటూ సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం పెళ్లి గురించి అన్షు రెడ్డి శ్రీ ప్రియ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇదివరకే అన్షు రెడ్డి ఒక అబ్బాయి తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దయింది అప్పటినుంచి ఈమె పెళ్లి ప్రస్తావన లేకుండా, కెరియర్ పై ఫోకస్ చేశారు.
నర్మద పాత్రలో నటిస్తున్న అన్షు రెడ్డి…
ప్రస్తుతం అన్షు రెడ్డి స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈమె.. అష్టా చమ్మా,ఇద్దరమ్మాయిలు, నా పేరు మీనాక్షి, సూర్యవంశం వంటి సీరియల్స్ చేశారు. ఇక శ్రీ ప్రియా విషయానికి వస్తే.. నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈమె కూడా ప్రస్తుతం వరుస బుల్లితెర సీరియల్స్ కు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా సీరియల్స్ చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈ ఇద్దరు సందడి చేస్తున్నారు.
Also Read: Aamir Khan: కూలీకి 20 కోట్ల రెమ్యునరేషన్… స్వయంగా చెప్పిన అమీర్ ఖాన్