Telugu Star Producer: టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్, పెద్ద నిర్మాత. భారీ బడ్జెట్ పెట్టి బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు విడుదల చేస్తున్నారు. కానీ అవి బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవుతున్నాయి. కమర్షియల్‌గాను హిట్ సాధించలేకపోతున్నాయి. ఇటీవల ఓ పెద్ద సినిమా రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో తెగ సందడి చేశారు. తన మాటే వేదనం, శాసనం అన్నట్టుగా మాటలతో రెచ్చిపోయారు. యావరేజ్ సినిమాకు హిట్ అని ప్రకటించారు. కమర్షియల్‌గా డీలా పడి నష్టాల్లోకి వెళ్లింది. కానీ, సినిమాకు ఫుల్ వసూళ్లు వచ్చేయంటూ మీడియా ముందు గొప్పలకు పోయారు. హిట్ కానీ మూవీకి సక్సెస్ మీట్స్ పెట్టి నానా హంగామా చేశారు.
నిర్మాత సైలెన్స్.. కారణమేంటో!
ఆ వెంటనే మరో పెద్ద హీరో సినిమా కొని విడుదల చేశారు. ఇది కూడా నష్టాల బాట పట్టింది. త్వరలోనే ఈ బడా నిర్మాత నుంచి ఓ పెద్ద హీరో సినిమా విడుదల కావాల్సింది. ప్రమోషన్స్ నానా హడావుడి చేయాల్సిన ఆ నిర్మాత ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సైలెంట్‌గా విదేశాలకు వెళ్లిపోయాడంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన బ్యానర్‌లో సినిమా రిలీజ్ ఉందంటే ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతారు. వరుస ట్వీట్స్, ప్రెస్ మీట్స్‌తో వార్తల్లో నిలుస్తారు. తన కామెంట్స్‌తో వైరల్ అవుతుంటారు. అవే ఆయన ప్రమోషన్స్ స్ట్రాటజీ అంటారు కొందరు.
ఎక్కడున్నార్ సర్?
కానీ అవే ట్రోలర్స్ ఆయుధాలు అవుతుంటాయి. ఇప్పటికే ఎన్నోసార్లు తన కామెంట్స్ ఈ బడా నిర్మాత ట్రోల్ అయ్యారు. అయినా తన తీరు మార్చుకోరు. ఆ ట్రోల్స్ తమ మూవీ ప్రమోషన్స్ అంటుంటారు. తన సినిమాలు రిలీజ్ అంటే ఈయన సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. తన నుంచి ఓ పెద్ద సినిమా రిలీజైంది.. మరో బడా హీరో మూవీ విడుదల కాబోతోంది. కానీ, ఆయన నుంచి ఇంతవరకు ఒక్క ట్వీట్ లేదు. కనీసం మూవీ అప్‌డేట్ కూడా లేదు. ఆయన సందడి కనిపించడం లేదాని ఆరా తీస్తే.. ఆ నిర్మాత ప్రస్తుతం సోషల్ మీడియాలను పక్కన పెట్టారట. కొన్ని రోజులు వీటన్నింటికీ దూరంగా ఉండాలని దుబాయ్ చెక్కేశారట.
Also Read: Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్
స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుని ఇప్పుడాయన సైలెంట్ అవ్వడం అభిమానుల్లో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఇంతకి తమ హీరో సినిమా రిలీజ్ ఉందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆ నిర్మాత యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఏమయ్యారు.. ఎందుకు సైలెంట్ అయ్యారని ఆరా తీయగా.. ఆ స్టార్ హీరో సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తున్నారట. బయ్యర్లు కూడా ఈ మూవీని ఇప్పుడు కోనలేమని చేతులెత్తేశారట. తమ దగ్గర డబ్బులు లేవని, ఇప్పటికే మీ బ్యానర్‌లోని సినిమాలు కొని నష్టాల్లో ఉన్నామంటూ గగ్గోలు పెడుతున్నారట. అప్పుడే మరో సినిమా అంటే తమ దగ్గర డబ్బులేవ్ అంటున్నారు. దీంతో ఆ నిర్మాత మూవీ రిలీజ్ వాయిదా వేయాలనే ఆలోచిస్తూ దుబాయ్‌కి వెళ్లిపోయారట.