Railway Employees Free Travel: రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉచితంగా రైళ్లలో ఎక్కవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ, వాస్తవ విషయం అందుకు విరుద్ధంగా ఉంటుంది. భారతీయ రైల్వే తమ ఉద్యోగులు, అధికారులకు పాస్ సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ, నియమ, నిబంధనలు ప్రతి స్థాయి ఉద్యోగికి భిన్నంగా ఉంటాయి.
నిర్ణీత కాలం చెల్లుబాటు అయ్యే పాస్ ల జారీ
రైల్వే పాస్ లు ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉచితంగా ప్రయాణించడానికి ఉపయోగపడుతాయి. కానీ, అవి నిర్ణీత కాలానికి మాత్రమే చెల్లుతాయి. నిర్దిష్ట నిబంధనలు, షరతులతో వీటిని జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వే ఉద్యోగులు కొన్ని ప్రదేశాలలో టికెట్ల కోసం డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. రైల్వే పాస్ లు చాలా వరకు అపరిమిత ఉచిత ప్రయాణం కంటే పరిమిత-కాల ప్రయాణ ప్రయోజనాలను అందిస్తాయి.
5 ఏండ్ల సర్వీస్ తర్వాత మంజూరు చేసే పాస్ లు
5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ తర్వాత ఉద్యోగులకు ఇండియన్ రైల్వే పాస్‌లు, PTO (ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్లు) అందిస్తాయి. ఉద్యోగులు సంవత్సరానికి మూడు సెట్ల ఉచిత రైల్వే పాస్‌లు, నాలుగు సెట్ల PTOలను పొందవచ్చు. అయితే, ఉద్యోగులు ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసే ముందు ఒక సెట్ పాస్ లను అందుకుంటారు. ఉద్యోగులకు, అధికారులకు వేర్వేరు నియమాలు వర్తిస్తాయి.
PTOలో ఛార్జీ వసూలు, పాస్ తో ఉచిత ప్రయాణం
రైల్వే పాస్ మొత్తం కుటుంబాన్ని ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అయితే PTO (ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్లు) ఉద్యోగులు ప్రయాణ ఛార్జీలో మూడింట ఒక వంతు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ ఉద్యోగి, జీవిత భాగస్వామి, పిల్లలను కవర్ చేస్తుంది. అదనంగా, ఆధారపడిన తల్లిదండ్రులను కూడా చేర్చవచ్చు.వారు ఒకే సౌకర్యం కింద ప్రయాణించడానికి వీలు ఉంటుంది.
Read Also: దేశంలో వింతైన రైల్వే స్టేషన్లు, రైల్వే మార్గాలు.. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!
పాస్ పరిమితి ముగిస్తే ఛార్జీ చెల్లించాల్సిందే!
మూడు పాస్ లు, నాలుగు PTO ల వార్షిక పరిమితి అయిపోయిన తర్వాత, రైల్వే ఉద్యోగులు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ఛార్జీలను చెల్లించాలి. పాస్, PTO సౌకర్యాలు ఒక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్ గా ముగుస్తాయి. కొత్త పాస్, PTO పొందడానికి, ఉద్యోగులు తమ రైల్వే ID, సర్వీస్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన పత్రాలను రైల్వే పరిపాలనకు సమర్పించాలి. ఉద్యోగి సర్వీస్ పుస్తకంలో జాబితా చేయబడిన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ సౌకర్యాలను ఉపయోగించి ప్రయాణించడానికి అర్హులు అవుతారు. సో, మొత్తానికి రైల్వే పాస్ ల ద్వారా రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. PTO లు ఉంటే నాలుగింట మూడో వంతు ఛార్జీ చెల్లించి ప్రయాణించాల్సి ఉంటుంది.
Read Also: తిరుమలలో ఈ రహస్య నీటి కొలను గురించి తెలుసా? ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు!