BigTV English

Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Vaibhav SuryaVamshi : భారత యువ బ్యాట్స్ మన్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavamshi)  14 సంవత్సరాల వయస్సులోనే  సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 14 ఏళ్ల వయస్సులోనే 2025 ఐపీఎల్ లోకి రాజస్థాన్ రాయల్స్( Rajastan Rayals) జట్టు తరపున ఆరంగేట్రం చేశాడు. ఇక ఈ సీజన్ లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్ రికార్డు నెలకొల్పిన విషయం విధితమే. దీంతో ఇటీవల ఇంగ్లాండ్‌లో పర్యటించి యూత్ వన్డే సిరీస్‌లో సెంచరీ సాధించాడు. భారత అండర్-19 జట్టు తరపున కూడా అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. వైభవ్‌ను భారతదేశ భవిష్యత్తుగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే  వైభవ్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.


Also Read : Irfan Pathan : ధోనీ వల్లనే జట్టులో చోటు కోల్పోయా.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ.. 


వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavamshi) పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో “బుల్లిరాజు” అని కొందరూ ట్రోలింగ్స్ చేయడం విశేషం. వాస్తవానికి బుల్లిరాజు అనే పేరు ఆ సినిమాలోని పాత్ర పేరు. అయితే ఆ బుడ్డోడు పేరు మాత్రం రేవంత్. బాల నటుడిగా బుల్లిరాజు పాత్రలో నటించాడు. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అలాగే సూర్యవంశీ కూడా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ లో తొలి బంతినే సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. తన మూడో మ్యాచ్ లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తద్వారా టీ-20 క్రికెట్ చరిత్రలోనే సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2025 సీజన్ మేటి బౌలర్లు అందరూ భయపడేలా చేశాడు. ముఖ్యంగా గుజరాత్ టైటిన్స్( Gujarat Titans) జరిగిన మ్యాచ్ లో ఖతర్నాక్ సిక్స్ లతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఆమ్యాచ్ చూసిన వారందరూ ఆశ్చర్యపోవడం విశేషం.

35 బంతుల్లోనే సెంచరీ..

పేసర్, స్పిన్నర్ అని తేడా లేకుండా సిక్సర్లతో స్టేడియాలను హోరెత్తించాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయస్సుల్లో కోట్ల రూపాయలను అర్జిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ బీహార్, సమస్తిపూర్ జిల్లాలోని తాజ్ పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక మామూలు రైతు. అయితే అతను క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. దీంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. నాలుగేళ్ల వయస్సులో వైభవ్ కి క్రికెట్ ఓనమాలు నేర్పారు. ఆ తరువాత సమస్తిపూర్ లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓఝా వద్ద శిక్షణ ఇప్పించారు. సాధారణ రైతు అయినప్పటికీ.. తన కుమారుడు క్రికెటర్ గా ఎదగాలనే కలను సాకారం చేయడానికి సంజీవ్ ఎన్నో త్యాగాలు చేసారు. వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకు ఉన్న కొంత భూమిని కూడా అమ్మేశారు. అలాంటి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ద్వారా రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నాడు.

?igsh=MTQwMDRiZzF6YnJwNg==

Related News

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Harry Brook: క్రికెట్ లోనే తొలిసారి… సరికొత్త షాట్ కనిపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇది చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Triple H: బికినీలో ప్రియురాలు… ట్రిపుల్ హెచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి

Irfan Pathan : ధోనీ వల్లనే జట్టులో చోటు కోల్పోయా.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Big Stories

×