Telugu Producer : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కార్మికులు తమ వేతనాలు 30% వరకు పెంచాలి అని కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని అందరూ ఊహించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సమస్యకు పరిష్కారం దొరక్కుండా పోయింది. ఇప్పటికే చాలా చోట్ల జరగాల్సిన షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు దీనిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది జరగటం లేదు. ఇలాంటి తరుణంలోనే ఇండస్ట్రీకి పెద్దదిక్కు లేకుండా పోయిందని అర్థమవుతుంది. చాలామంది సినిమా నిర్మాతలు మీడియా ముందు కనిపిస్తున్నారు. అలానే ఇంకొంతమంది నిర్మాతలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు.
ఆ నిర్మాత సైలెంట్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేర్లలో అతను కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. తాను నిర్మించిన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిన రోజులు ఉన్నాయి. ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఏమీ ఆలోచించకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్ కు వెళ్లిపోయేవారు.
సొంత సినిమాలు ఫెయిల్
ఆయన ఒక సినిమాను నిర్మిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అయితే అవ్వదు అని చాలామంది ప్రేక్షకులకు క్లారిటీ ఉంది. అలానే ఆ బ్యానర్ లో సినిమాలకు ఫెయిల్యూర్ రేట్ కూడా తక్కువ. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలు ఫెయిలవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ బ్యానర్లు ఊహించిన సక్సెస్ఫుల్ సినిమాలో రావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు డిజాస్టర్ లు అయిపోతున్నాయి.
డిస్ట్రిబ్యూషన్ కూడా దెబ్బేసింది
కేవలం ఆ నిర్మాత సినిమాలు నిర్మించడమే కాకుండా డిస్టిబ్యూషన్ కూడా చేస్తుంటారు. ఆయన నిర్మించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించడం లేదు. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు కూడా నిరాశ పరుస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రీలో ఇన్ని రకాల సమస్యలు వస్తున్న కూడా ఆయన మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడితే ఆ మాటలు ఇంకెక్కడికో దారి తీస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పడుతున్నారు. కానీ ఆయన మౌనం చాలామందికి నిరాశ కలిగిస్తుంది అని చెప్పాలి. ఇంకా ఇండస్ట్రీలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన ఆ నిర్మాత బయటకు వచ్చి మాట్లాడుతారో, లేకుంటే మౌనాన్ని వహిస్తారో చూడాలి.
Also Read: Satya Raj : బాహుబలిలో ప్రభాస్ నా తలపై కాలు పెట్టడం అంటే… మూవీనే రిజక్ట్ చేశా