Aamir Khan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan)ఇటీవల కాలంలో సౌత్ సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా సౌత్ సినిమాలలో భాగం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ తాజాగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth)ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమాలో(Coolie Movie) నటించారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
రూ. 20 కోట్ల రెమ్యునరేషన్?
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి ఉపేంద్ర టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నాగార్జున వంటి సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే కూలీ సినిమాలో కూడా ఈయన క్యామియో పాత్రలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్(Remuneration) తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.
అదే కొన్ని కోట్లతో సమానం..
ఇలా కూలీ సినిమాలో క్యామియో పాత్రలో నటించడానికి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు ఈ రెమ్యూనరేషన్ తో మన తెలుగు ఇండస్ట్రీలో ఓ చిన్న హీరోతో ఏకంగా ఒక చిన్న సినిమా కూడా చేయవచ్చు. ఇలా తన రెమ్యూనరేషన్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా అమీర్ ఖాన్ ఈ వార్తలపై స్పందించారు. తాను కూలీ సినిమా కోసం 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలియజేశారు. తాను ఈ సినిమాలో నటించడం కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, రజనీకాంత్ లాంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే నాకు కొన్ని కోట్ల రూపాయలతో సమానమని వెల్లడించారు. రజనీకాంత్ గారితో కలిసి నటించే అవకాశం రావడం కంటే విలువైనది మరేదీ లేదని అమీర్ ఖాన్ తెలిపారు.
నిరాశలో రజనీకాంత్ అభిమానులు…
ఇలా అమీర్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఎన్నో అంచనాల నడుమ కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల అయింది అయితే ప్రేక్షకులను కొంతమేర ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి కానీ, ఆ అంచనాలను చేరుకోలేకపోయారని తెలుస్తోంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలను చేరుకోవడంలో ఈ సినిమా వెనుకబడిందని చెప్పాలి.
Also Read: Madhavan: అవసరమైతే తప్ప ఆ పని చేయను.. రజనీకాంత్ గారి నుంచే నేర్చుకున్నా!