Team India: తెలుగు ( Tolly wood) సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పుడు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన నటి కాజల్ అగర్వాల్ ( kajal Agerwal) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది తెలుగులో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ చిన్నది ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా అనంతరం ఈ చిన్నది వెను తిరిగి చూడకుండా ఎంతోమంది పెద్దపెద్ద హీరోల సినిమాలలోనూ అవకాశాలను కొట్టేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరితో హీరోయిన్ గా చేసింది. ఇక ఈ చిన్నది తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత సినిమాలకు ఈ చిన్నది కాస్త గ్యాప్ ఇచ్చింది. అనంతరం ఆ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ తన మాతృత్వాన్ని ఆస్వాదించింది. కొన్ని రోజుల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. తర్వాత మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ బ్యూటీతో సినిమాలు చేయడానికి ఎవరు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. కొన్ని రోజుల ప్రయత్నాల తర్వాత ఈ చిన్నది మళ్లీ వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోతోంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ( kajal Agerwal) కన్నప్ప సినిమాలో నటించింది. ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది.
రోహిత్ శర్మ అంటే ఇష్టం.. కాజల్ అగర్వాల్ కామెంట్స్
ఇక కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన క్రికెటర్ రోహిత్ శర్మ అని చెప్పింది. తనకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టమని తన ఆట తీరు ఎంతగానో నచ్చుతుందని చెప్పింది. క్రికెటర్లలో తన క్రష్ రోహిత్ శర్మ అని హాట్ కామెంట్స్ చేసింది. తాను ఒప్పుకుంటే వివాహం చేసుకునే దానిని కానీ అప్పటికే రోహిత్ శర్మకు వివాహం జరగడం వల్ల సైలెంట్ గా ఉన్నానని కాజల్ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాట్లాడిన ఈ మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీంతో కొంతమంది కాజల్ అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ కాజల్ ఎప్పటిలానే సినిమాలలో నటించి సక్సెస్ సాధించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే